అమరావతికి పూర్వవైభవం - పెట్టుబడులకు ఆస్ట్రేలియా ఆసక్తి - CONSULATES MEET CRDA COMMISSIONER - CONSULATES MEET CRDA COMMISSIONER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 11:48 AM IST
Australia Consulate General Meet CRDA Commissioner : సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత అమరావతికి పూర్వవైభవం సంతరించుకుంటోంది. పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. చెన్నైలోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్‌కు చెందిన ప్రతినిధులు సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌తో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సిలై జాకి, ఇతర ఆస్ట్రేలియా ప్రతినిధులు భేటి అయ్యారు. రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టి ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు.
ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలకు అమరావతిలో ఉన్న వాణిజ్య అవకాశాలపై సీఆర్డీఏ కమిషనర్‌తో కాన్సుల్ జనరల్ చర్చించారు. రాజధాని ప్రత్యేకతల గురించి కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? అమరావతిలో ఏయే రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని ఆయన ఆరా తీశారు. అమరావతి బృహత్తర ప్రణాళిక, అవకాశాల గురించి కమిషనర్ భాస్కర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, అవకాశాలపై ఆ దేశ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇక్కడ తగినంత భూమి అందుబాటులో ఉందని, పెట్టుబడులు పెట్టొచ్చని, మంచి అవకాశాలు ఉన్నాయని వారికి కమిషనర్ చెప్పారు.