జెన్‌కో నిర్లక్ష్యంతో కట్ట తెగిన యాష్పాండ్- పొలాల్లోకి భారీగా బూడిద నీరు - Ashpond Embankment Damaged - ASHPOND EMBANKMENT DAMAGED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 4, 2024, 9:52 AM IST
Ashpond Embankment Damaged in Nellore District : జెన్‌కో అధికారుల నిర్లక్ష్యంతో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో పొలాలన్నీ బూడిదతో నిండిపోయాయి. నేలటూరులో దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ స్టేషన్ కి చెందిన యాష్ పాండ్ కట్ట తెగడంతో సమీపంలోని పంట పొలాల్లోకి భారీగా బూడిద నీరు చేరింది. 300 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు కట్ట తెగడంతో సమీప గ్రామాలు ముసునూరువారిపాలెం, ఆముదాలపాడు, మిట్టపాలెం పొలాల్లోకి బూడిద, ఉప్పు నీరు చేరింది. పల్లపు ప్రాంతమైన పైనాపురం వైపూ బూడిద నీరు ప్రవహిస్తుండటంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Genco officials Neglect Ashpond Embankment Maintance : జెన్‌కో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తరచూ కట్టలు తెగిపోవడం, పైపులు ధ్వంసమవుతున్నాయని రైతులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి బూడిద నీరంతా పొలాల్లోకి చేరి నష్టపోతున్నామని వాపోతున్నారు. అధికారులు ఇందుకు శాశ్వత చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.