కేంద్ర బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోని తలపిస్తోంది : షర్మిల - Sharmila Comments on AP Budget - SHARMILA COMMENTS ON AP BUDGET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 7:29 PM IST
APCC Chief Sharmila Comments on AP Budget 2024 : కేంద్ర బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోని తలపిస్తోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. పోలవరానికి బడ్జెట్‌లో ఎంత కేటాయించారో చెప్పాలని ఆమె నిలదీశారు. బడ్జెట్‌లో కేవలం రాజధానికి మాత్రమే నిధులు కేటాయించారని పోలవరానికి ఎంత ఇస్తారో చెప్పలేదని షర్మిల అన్నారు. పోలవరం ప్రాజెక్టు రైతులకు జీవనాడిగా కేంద్రమంత్రి అభివర్ణించారని అలాంటి ప్రాజెక్టు కోసం ఎన్ని నిధులు కేటాయిస్తారనేది ప్రస్తావించలేదని షర్మిల అన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అంచనా వ్యయం ఎంతో తెలియదని, ఒక్క పునరావాసానికే 12 వేల కోట్ల రూపాయలు కావాలని షర్మిల చెప్పారు. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలో కారిడార్లకు ఎన్ని నిధులు ఇస్తారో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందన్నారని ఎప్పుడు అనేది స్పష్టత లేదన్నారు. బడ్జెట్‌లో ప్రత్యేక హోదా అంశంపై ఒక్క మాట కూడా ప్రస్తావించలేదని ఆమె అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని బీజేపీకి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.