ప్రారంభమైన టెట్​ పరీక్ష - మార్చి 6వ తేదీ వరకు - AP TET Exam Dates

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 12:22 PM IST

AP TET Exam: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు మంగళవారం నుంచి మార్చి 6 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ సురేశ్​ కుమార్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు 2 లక్షల 67, 559 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని ఆయన వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో 3 పరీక్షా కేంద్రాలు, కర్ణాటకలో 3, తమిళనాడులో 2, ఒడిశాలో 2 చొప్పున పరీక్ష కోసం సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 

AP TET Exam Dates  దివ్యాంగ అభ్యర్థులు పరీక్ష రాయడానికి వీలుగా స్క్రైబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గర్భిణులు సమీప పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసుకోవడానికి వెసులుబాటు కల్పించామని సురేశ్​ కుమార్‌ తెలిపారు. పరీక్ష కేంద్రాలపై ఏవైనా సందేహలుంటే అభ్యర్థులు సంబంధిత జిల్లా విద్యా శాఖ అధికారులను సంప్రదించాలని ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హెల్ప్​డెస్క్​లను ఏర్పాటు చేసినట్లు వివరించిన సంగతి తెలిసిందే. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.