రేపే ఇంటర్ ఫలితాలు - ఎన్ని గంటలకంటే? - Inter results 2024
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 4:40 PM IST
AP Inter Exam Results Date : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు (ఏప్రిల్ 12న) విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఇంటర్ పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇప్పటికే ఇంటర్ పరీక్ష పత్రాలు మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు ఫలితాల విడుదలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి, రెండవ సంవత్సరానికి గాను దాదాపు 10 లక్షల మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంటర్ పరీక్షల ఫలితాలను www.bie.ap.gov.in అధికార వైబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వేగవంతమైన ఫలితాల కోసం www.eenadu.net, www.etvbharat.com ను సందర్శించవచ్చును.