పోస్టల్‌ బ్యాలెట్‌ అంశంపై వైఎస్సార్సీపీకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ - high court orders on ysrcp petition

🎬 Watch Now: Feature Video

thumbnail

AP High court Orders on YSRCP Postal Ballot Petition : పోస్టల్ బ్యాలెట్ అంశంపై వైఎస్సార్సీపీకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం సరిపోతుంది, అధికారి వివరాలు, సీల్ లేకున్నా చెల్లుతుందన్న ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈసీ నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించింది. అంతే కాకుండా ఈసీ నిర్ణయంపై జోక్యం చేసుకోబోమని తెలిపింది.

పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు చేసేప్పుడు ఓటర్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఫాం-13Aపై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదని ఈసీ తరఫు న్యాయవాది వాదించారు. కేవలం ఆ అధికారి సంతకం ఉంటే చాలని మే 30న తాము ఇచ్చిన ఉత్తర్వులు నిబంధనల మేరకే ఉన్నాయని హైకోర్టుకు న్యాయవాది తెలిపారు. ఇరువైపుల వాదనలు  విన్న న్యాయమూర్తులు ఈసీ నిర్ణయంపై జోక్యం చేసుకోబోమని చెప్పారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ల వ్యాజ్యాలపై విచారణ పూర్తైందని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఎన్నికలపై అభ్యంతాలు ఉంటే ప్రక్రియ ముగిసిన తర్వాత పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.