పెండింగ్ ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ వేగంగా పూర్తి చేయాలి: ముఖేష్ కుమార్ మీనా - Chief Electoral Officer of ap
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 7:37 PM IST
AP Chief Electoral Officer Mukesh Kumar Meena Video Conference : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులతో పాటు అధికారులలో సైతం హడావిడి మెుదలైంది. లోక్సభ ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల అధికారులు పటిష్ఠంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (Chief Electoral Officer) ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన సమీక్ష నిర్వహిస్తూ పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh CEO : త్వరలో జరగబోయే ఎన్నికల కోసం జిల్లా ఎన్నికల అధికారులు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించిన వెంటనే అమల్లోకి రానున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్ఠంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ముఖేష్ కుమార్ మీనాతో పాటు సంబంధిత అధికారులు పాల్లొన్నారు.