ఏపీ బెవరేజెస్‌ చోరీ కేసులో బెయిల్ మంజూరుకు వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ - APSBCL Former MD bail Petition - APSBCL FORMER MD BAIL PETITION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 9:11 AM IST

AP Beverages Theft Case Bail Petition Filed in High Court : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెట్‌ చోరీ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని ఆ సంస్థ మాజీ ఎండీ డి. వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీఎస్‌బీసీఎల్‌ (APSBCL) కార్యాలయంలో కీలక దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలు చోరీ, ఆధారాల ధ్వంసం ఆరోపణలతో డి. వాసుదేవరెడ్డిపై సీఐడీ (CID) అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఆయన హై కోర్టును ఆక్రయించారు.

వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్‌ నేడు ఈ వ్యాజ్యంపై విచారణ చేయనుంది. ఈ నెల 6న ( జూన్​ 6న) ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు చోరీచేసి తరలిస్తుండగా చూశానంటూ ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం మెుగులూరుకు చెందిన శివకృష్ణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అతని ఫిర్యాదు మేరకు మంగళగిరి సీఐడీ పోలీస్​ స్టేషన్​లో వాసుదేవరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసుపైనే ప్రత్యేక బెంచ్​ ఇవాళ విచారణ చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.