ఏఎన్‌యూ వీసీపై విద్యార్థి సంఘాల ఆగ్రహం- నల్ల రంగు పూసి నిరసన - Student Unions on ANU VC Policies - STUDENT UNIONS ON ANU VC POLICIES
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-06-2024/640-480-21672004-thumbnail-16x9-anu-vc-policies.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 5:05 PM IST
ANU VC Rajasekhar Policies Condemned by Student Unions: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ రాజశేఖర్ విధానాలను విద్యార్థి సంఘాలు ఖండించాయి. ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ నేతల అడుగులకు మడుగులొత్తిన ఆయన ప్రభుత్వం మారగానే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వ్యవహరించడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల్లో గెలుపొందిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, కూటమి అభ్యర్థులకు మద్దతుగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. రంగులు మార్చడంలో వీసీ రాజశేఖర్ ఊసరవెల్లిని మించిపోయారని ఫ్లెక్సీపై ఉన్న వీసీ చిత్రపటానికి విద్యార్థులు నల్ల రంగు పూసి నిరసన తెలిపారు.
అనంతరం ఎన్టీఆర్, చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆర్థిక అవకతవకల నుంచి బయటపడేందుకే ఇలాంటి నాటకాలు అడుతున్నారని టీఎస్ఎన్ఎఫ్ (TNSF) నాయకుడు బాలరాజు ఆరోపించారు. ఐదేళ్లు వైఎస్సార్సీపీ నేతల అడుగులకు మడుగులు ఒత్తారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత ఐదేళ్లుగా విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్సీపీ ఉపకార్యాలయంగా మార్చారని ఆరోపించారు. వీసీ అక్రమాలపై ప్రశ్నించిన విద్యార్థులను, అధ్యాపకులను వేధించడం లాంటి ఘటనలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు వెల్లడించాయి.