అలుగు అక్రమ రవాణా- కఠిన చర్యలు తీసుకోవాలంటూ పర్యావరణ ప్రేమికుల డిమాండ్ - Alugu Smuggling Suspects in palnadu - ALUGU SMUGGLING SUSPECTS IN PALNADU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 1, 2024, 5:22 PM IST
Environment Lovers Demand For Actions Against Alugu Smuggling Suspects : పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో అక్రమంగా అలుగు జంతువును తరలిస్తున్న ముఠాను పట్టుకోబోయిన అధికారులపై దాడి చేసిన వీడియోలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. అలుగు అక్రమ రవాణాను అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేసిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అలుగును పట్టి ఇచ్చేందుకు గుప్త నిధుల వేట సాగించే ముఠా నిందితుడు గోవింద్ నాయక్‌కు రూ.5లక్షల ముట్టచెప్పారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన నాగేశ్వరరావు, నాగేంద్రకుమార్, వెంకటేశ్వర్ల ముఠా నుంచి గతంలోనూ లక్షలాది రూపాయలు తీసుకుని అడవి జంతువులను విక్రయించినట్లు తెలుస్తోంది. అరుదైన వన్య జంతువుల్ని అక్రమంగా తరలిస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించిన విషయం విధితమే.