LIVE: అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - AP ASSEMBLY SESSIONS 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 9:03 AM IST

Updated : Jul 25, 2024, 3:22 PM IST

thumbnail
AP Assembly Sessions 2024 fourth Day: నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శాసనసభ వేదికగా శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గడచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరును వివరించనున్నారు. జగన్‌ ఏలుబడిలోని అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు వంటి అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించనున్నారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించనున్నారు. డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యం, కోడి కత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం వైఖరి, వివేకా హత్యకేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. గడచిన ఐదేళ్లుగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు పెద్ద ఎత్తున నమోదైన అంశాలనూ శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం. అదే విధంగా ఇటీవల మృతిచెందిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షప్రసారం. 
Last Updated : Jul 25, 2024, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.