మద్యం కుంభకోణంలో సీఎం జగన్ జైలుకు వెళ్లక తప్పదు: కూటమి నేతలు - Alliance Party Leaders - ALLIANCE PARTY LEADERS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 5:11 PM IST
Alliance Party Leaders Comment on Prohibition of Alcohol : దిల్లీ మద్యం కుంభకోణానికి మించిన కుంభకోణం జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిందని కూటమి నేతలు తెలిపారు. తిరుపతి జిల్లాలో కూటమి నేతలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే జగన్ చేసిన మద్యం కుంభకోణంపై త్వరలోనే విచారణ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మద్యం పాలసీతో సీఎం జగన్ లక్ష కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. మద్య విక్రయాల్లో ఏటా రూ. 20 వేల కోట్లు ఆదాయం వస్తున్నా ఎందుకు డిజిటల్ లావాదేవీలు చేయలేదని ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా దొరకని కొత్త పేర్లతో నాసిరకం, ప్రాణాంతకమైన మద్యాన్ని విక్రయిస్తున్నారని కూటమి నేతలు ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో ఒకటి మద్యపాన నిషేధాన్ని తమ మేనిఫెస్టోలో చేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు మద్యాన్ని నిషేధించకపోగా ప్రభుత్వ ఖాజానాకు ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో జగన్ జైలుకు వెళ్లక తప్పదన్నారు.