'10లక్షల ఆహార ప్యాకెట్లు అందించాం- వాటిని బాధితులకు చేర్చడం గొప్పవిషయం' - akshaya patra 10 lakhs food packets - AKSHAYA PATRA 10 LAKHS FOOD PACKETS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 6, 2024, 4:54 PM IST
Akshaya Patra Distribute 10 lakhs Food Packets for Flood Victims : వరదల్లో చిక్కుకున్న బాధితులకు గత ఐదు రోజులుగా సుమారు 10 లక్షల ఆహార ప్యాకెట్లు అందించామని విజయవాడ, గుంటూరు అక్షయపాత్ర ప్రెసిడెంట్ వంశీదాస ప్రభు తెలిపారు. దివిస్ ల్యాబ్, ప్రభుత్వ సహకారంతో రికార్డు స్థాయిలో బాధితులకు ఆహారాన్ని అందించామన్నారు. ప్రభుత్వం ఎప్పుడు, ఎంత అడిగినా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వంశీదాస చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతోనే ఇంత మందికి ఆహారం అందించడం సాధ్యమైందన్నారు.
వరద బాధితుల కోసం మంచి రుచికరమైన, పౌష్టికాహారాన్ని తయారు చేస్తున్నట్లు వివరించారు. ఇంత పెద్దమొత్తంలో తయారైన ఆహారాన్ని ప్యాకింగ్ చేసేందుకు స్వచ్ఛందంగా మహిళలు, వివిధ సంస్థలు, అసోసియేషన్ సిబ్బంది, మెప్మా మహిళాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని తెలిపారు. మేము ఎంత ఆహారం వండినా దానిని బాధితుల వద్దకు చేర్చడం గొప్పవిషయమన్నారు. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా చక్కగా నిర్వహించారన్నారు. అక్షయపాత్ర చరిత్రలో 10లక్షలు ఆహార ప్యాకెట్లు అందించడం రికార్డు అని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వంశీదాస ప్రభు తెలిపారు.