న్యాయం చేస్తానని హామీ ఇచ్చి మోసం - అగ్రిగోల్డ్‌ బాధితుల నిరసన - Agrigold Victims

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 7:38 PM IST

Agrigold Victims Protest in Anakapalli District : గత ఎన్నికల సమయంలో అగ్రిగోల్డ్ సంస్థ వల్ల నష్టపోయిన వారికి న్యాయం చేస్తానని హమీ ఇచ్చిన  సీఎం జగన్‌, అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి అగ్రిగోల్డ్‌ బాధితులు నిరసన చేపట్టారు. సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మాట తప్పి మడమ తిప్పిన జగన్ మోహన్​ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 

అగ్రిగోల్డ్​ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని సీఎం జగన్​ మోహన్​ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్ల అవుతున్నా తమ గురించి ఆలోచించడం లేదని బాధితులు వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.