చంద్రబాబు ప్రమాణ స్వీకారం- గన్నవరం విమానాశ్రయం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు - Gannavaram Airport - GANNAVARAM AIRPORT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 5:15 PM IST
Gannavaram Airport passengers: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, సీఎం లు హాజరు కానున్న దృష్ట్యా గన్నవరం విమానాశ్రయంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే హైవే పై రాకపోకలు దాదాపు నిలిచిపోనున్నాయి. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా విమాన ప్రయాణికులకు విమానాశ్రయ డైరెక్టర్ ఎం. లక్ష్మీకాంత రెడ్డి ప్రత్యేక సూచనలు జారీ చేశారు.
ఈ నెల 12న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమానాల్లో వెళ్లే ప్రయాణికులంతా ఉదయం 9.30 లోపే విమానాశ్రయానికి చేరుకోవాలని లక్ష్మీకాంత రెడ్డి సూచించారు. ప్రయాణికుల విమానాలేవీ రద్దు చేయలేదని, అన్నీ యథాతథంగా నడుస్తాయని తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, షిరిడి కి వెళ్లే విమానాలు మామూలుగానే తిరుగుతాయని వెల్లడించారు. ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయం చేరుకోవాలని కోరారు. పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు.