సరదా కోసం సవారీ చేస్తే - కింద పడేసి బాలుడి ప్రాణం తీసింది - Boy died on buffalo ride - BOY DIED ON BUFFALO RIDE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 12:33 PM IST

Buffalo Killed a 12 Year Old Boy : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నాగూర్-కే గ్రామంలో ఓ గేదె 12 ఏళ్ల బాలుడి ప్రాణం తీసింది. బాల్నోర్ మారుతి కుమారుడు రాజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో పశువులను పొలంలో మేపడానికి ఓ గేదెపై కూర్చుని మరీ వెళ్లాడు. ఆ గేదెకు తాడు కట్టి, దానిని రాజు తన నడుముకు కట్టుకున్నాడు. అనుకోకుండా ఆ గేదె బాలుడిని కింద పడేసి ఈడ్చుకొని వెళ్లింది.

దీంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాజు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకు పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. అయితే రాజు పొలానికి వెళ్లే ముందు గేదెపై కూర్చున్న వీడియోను తీశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.