ఓటరు జాబితాలో అవకతవకలు - ఇంటి నంబరు స్థానంలో బూదగవి, మారెమ్మ టెంపుల్ - mistakes in voter list
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 11:34 AM IST
18 Votes With Same House Number at Budagavi: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఓటరు జాబితాలో అవకతవకలు ఇంకా కొకల్లుగా వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి పోలింగు కేంద్రం (Polling station) 139లో 849 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జాబితాలో ఒకటో ఇంటి నంబరుతో 18 దొంగ ఓట్లు ఉన్నాయి.
Mistakes In Voter List: ఓటరు జాబితాలో 5, 8,10,11,13, 14,16,17,19,21,22,24,26,27,28,29,30,33లో ఉన్న ఓటర్లందరికీ (Voters) ఇంటి నంబరు 1గా మరో 8 మంది ఓటర్లకు ఇంటి నంబరు 2గా నమోదు చేశారు. 821, 824, 837 ఓటర్లకు ఇంటి నంబరు స్థానంలో బూదగవి అని ఊరి పేరు నమోదు చేశారు. 840 సంఖ్యలో ఓటరుకు ఇంటి నెంబరు స్థానంలో మారెమ్మ టెంపుల్గాను, 847 ఉన్న ఓటరుకు ఇంటి నెంబరు స్థానంలో ఎస్సీ కాలనీ అని ఉంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార వైఎస్సార్సీపీ నేతలు అన్నివిధాలుగా అక్రమాలకు తెగబడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.