ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీకి భారీ షాక్ - 14 YCP corporators joined TDP - 14 YCP CORPORATORS JOINED TDP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-09-2024/640-480-22350792-thumbnail-16x9-14-ycp-corporators-joined-tdp-in-eluru-municipal-corporation.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2024, 7:52 PM IST
14 YCP Corporators Joined TDP in Eluru Municipal Corporation : ఏలూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్సీపీకి భారీ షాక్ తగిలింది. 14 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే బడేటి చంటి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే మేయర్ నూర్జహాన్, ఆమె భర్త కో-ఆప్షన్ సభ్యుడు SMR పెదబాబు, హిడా ఛైర్మన్, మాజీ AMC ఛైర్మన్లు నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం మరో 14 మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొవడంతో వైఎస్సార్సీపీకి గట్టి దెబ్బ తగిలిందని రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. దీనిపై ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, గడిచిన మూడేళ్ల కాలంలో వైఎస్సార్సీపీకి చెందిన కార్పొరేటర్లు తమ డివిజన్లలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారని తెలిపారు.
దీనిపై వారు కూడా ఆవేదన వ్యక్తం చేశారని వెల్లడించారు. గత ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి అరాచక పాలన సాగించినందుకే పార్టీ ఘోరంగా ఓడిపోయినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారని వివరించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరితే ప్రజలకు మరింత సేవచేసే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో వారు పార్టీలో చేరినట్లు తెలిపారు. వారందరి సహకారంతో స్నేహపూర్వకంగా నగరాన్ని అభివృద్ధి చేసుకుని ప్రజలకు మరింత సేవ చేస్తామని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు.