'బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారంటీ' - వైసీపీని వీడిన 110 కుటుంబాలు - టీడీపీలో చేరిన వైసీపీ నేతలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 12:59 PM IST
110 Families Joined TDP in Kamalapuram Constituency: వైఎస్సార్ జిల్లా కమలాపురం, పెండ్లిమర్రి మండలాల్లో 110 కుటుంబాలు వైఎస్సార్సీపీను వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. మంగళవారం సాయంత్రం తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి పలువురు టీడీపీ నేతలు బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం (Babu Surity Bhavishattu Gaurantee Program) లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి సూపర్ సిక్స్ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. టీడీపీ (TDP)లో చేరిన పెండ్లిమర్రి ప్రజలను కండువా కప్పి పార్టీలోకి నరసింహారెడ్డి ఆహ్వానించారు.
TDP Vice President Putta Narasimha Reddy Invited YSRCP Leaders into TDP: పుత్తా నరసింహారెడ్డి (Putta Narasimha Reddy) వల్ల అందరికీ మేలు జరుగుతుందని నమ్మి టీడీపీ పార్టీలో చేరామని స్థానికులు వెల్లడించారు. తాను, పార్టీ అన్ని విధాలుగా నియోజకవర్గ ప్రజలందరికీ అండగా ఉంటామని నరసింహారెడ్డి స్పష్టం చేశారు.