ETV Bharat / technology

స్టన్నింగ్ ఫీచర్స్​తో శాంసంగ్ గెలాక్సీ A55; A35 5G ఫోన్స్​ - ధర ఎంతంటే? - Samsung A55 and A35 5g phone Launch

Samsung A55 Phone Launch : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్​​ కంపెనీ శాంసంగ్​ బుధవారం ఇండియాలో గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 5జీ ఫోన్లను లాంఛ్ చేయనుంది. వీటి ఫీచర్స్, స్పెక్స్, ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung A35 5g phones Launch
Samsung A55 phone Launch
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 3:54 PM IST

Updated : Mar 20, 2024, 4:23 PM IST

Samsung A55 Phone Launch : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ బుధవారం ఇండియన్​ మార్కెట్లో గెలాక్సీ ఏ55 5G; గెలాక్సీ ఏ35 5G ఫోన్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరికొత్త 'A' సిరీస్ మొబైల్ ఫోన్లు గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటక్షన్​, ఏఐ కెమెరా ఫీచర్స్​ కలిగి ఉంటాయి. అలాగే ఇవి ట్యాంపర్-రెసిస్టెంట్ సెక్యూరిటీ సొల్యూషన్, శాంసంగ్ నాక్స్ వాల్ట్‌తోపాటు పలు సరికొత్త ఫీచర్లు కలిగి ఉన్నాయని శాంసంగ్​ కంపెనీ తెలిపింది.

"గత రెండు సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా 'గెలాక్సీ ఏ' సిరీస్ నిలిచింది. ముఖ్యంగా భారతదేశ వినియోగదారుల నుంచి అపూర్వమైన ఆదరణను పొందింది. గెలాక్సీ ఏ55 5G & ఏ35 5G విడుదల ప్రతిష్టాత్మక ఆవిష్కరణలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే మా నిబద్ధతను బలోపేతం చేస్తుంది. గెలాక్సీ ఏ55 5G & ఏ35 స్మార్ట్​ఫోన్​లను 5G సెగ్మెంట్​లో తీసుకువస్తున్నాం. ఇండియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మిడ్-ప్రీమియం (రూ.30,000 - రూ.50,000) సెగ్మెంట్‌లో మా నాయకత్వాన్ని ఏకీకృతం చేయడంలో ఇవి మాకు సహాయపడతాయి."
_ గుఫ్రాన్​ ఆలం, శాంసంగ్ ఇండియా ఎంఎక్స్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్

Samsung A55, A35 5G Features :

సూపర్​ డిజైన్ : మొదటి సారి గెలాక్సీ ఏ55 5Gను మెటల్​ ఫ్రేమ్​తో తీసుకువస్తున్నారు. గెలాక్సీ ఏ35 5G అయితే ప్రీమియం గ్లాస్ బ్యాక్​తో వస్తుంది. ఈ ఫోన్‌లు ఆసమ్ లిలక్, ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ నేవీ అనే 3 కలర్​ వేరియంట్లలో లభిస్తున్నాయి. వీటికి ఐపీ 67 రేటింగ్ ఉంది. అందువల్ల 1 మీటర్ లోతున్న నీళ్లలో పడిపోయినా, 30 నిమిషాల వరకు వీటికి ఏమీ కాదు. పైగా ఇవి దుమ్ము, ఇసుకను కూడా సమర్థవంతంగా నిరోధించగలుగుతాయి.

బెస్ట్​​ డిస్​ప్లే : శాంసంగ్​ గెలాక్సీ ఫోన్లు 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో, కనిష్టీకరించిన బెజెల్స్‌తో వస్తాయి. 120Hz రిఫ్రెష్ రేట్ చాలా మృదువైన పనితీరును అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ముందు, వెనుక భాగాలు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటక్షన్​తో వస్తాయి.

ఏఐ కెమెరా : ఈ కొత్త 'ఏ' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఏఐ-కెమెరా ఫీచర్స్​తో వస్తున్నాయి. వీటిని ఉపయోగించి ఫోటో రీమాస్టర్, ఇమేజ్ క్లిప్పర్, ఆబ్జెక్ట్ ఎరేజర్ చేసుకోవచ్చు. గెలాక్సీ ఏ55 5G, ఏ35 5Gలు ఏఐ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ (ISP) సామర్థ్యంతో వస్తాయి. కనుక రాత్రి వేళల్లోనూ వీటితో అద్భుతమైన చిత్రాలు, వీడియోలు తీసుకోవచ్చు. ఈ ఫోన్లు 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్​తో వస్తాయి.

హై సెక్యూరిటీ : శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీని మొదటిసారిగా ఏ -సిరీస్‌లో పొందుపరిచారు. కనుక యూజర్లకు ఫ్లాగ్‌షిప్ స్థాయి భద్రత లభిస్తుంది.

ప్రాసెసర్​ : గెలాక్సీ ఏ55 5Gలో సరికొత్త ఎక్సినాస్ 1480 ప్రాసెసర్​ ఉంటుంది. గెలాక్సీ ఏ35 5Gలో 5nm ప్రాసెస్ టెక్నాలజీపై నిర్మించిన ఎక్సినాస్ 1380 ప్రాసెసర్‌ ఉంది. ఈ పవర్-ప్యాక్డ్ ఫోన్‌లు NPU, GPU, CPU అప్‌గ్రేడ్స్​తో, 70%+ పెద్ద కూలింగ్ ఛాంబర్‌తో వస్తాయి. కనుక హెవీ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు.

గెలాక్సీ ఏ55 5Gలో 12GB RAM ఉంటుంది. కనుక స్టోరేజీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. గెలాక్సీ ఏ55 5G, గెలాక్సీ ఏ35 5G కొనుగోలుదారులు శాంసంగ్ వాలెట్​ను యాక్సెస్ చేసుకోవచ్చు. మీ చెల్లింపు కార్డ్‌లు, డిజిటల్ ఐడీ, ప్రయాణ టిక్కెట్‌లు అన్నింటినీ దీనికి జోడించుకోవచ్చు.

Samsung Galaxy A55 Price :

  • గెలాక్సీ ఏ 55 5G (8GB+128GB) ధర రూ.36,999
  • గెలాక్సీ ఏ 55 5G (12GB+256GB) ధర రూ.42,999
  • గెలాక్సీ ఏ 35 5G (8GB+128GB) ధర రూ.27,999
  • గెలాక్సీ ఏ 35 5G (8GB+256GB) ధర రూ.30,999

Samsung Offers : HDFC, OneCard, IDFC ఫస్ట్ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా ఈ శాంసంగ్ ఫోన్లు కొనుగోలు చేస్తే రూ.3000 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. 6 నెలల నో కాస్ట్ EMI ఫెసిలిటీ కూడా దొరుకుతుంది.

• శాంసంగ్ వాలెట్ : మొదటి విజయవంతమైన ట్యాప్ & పే లావాదేవీ పై రూ. 250 విలువైన అమెజాన్ వోచర్‌ లభిస్తుంది.

• యూట్యూబ్ ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ : 2 నెలలు ఉచితం (ఏప్రిల్ 1, 2025 వరకు)

• మైక్రోసాఫ్ట్ 365 : మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ + 6 నెలల క్లౌడ్ స్టోరేజ్ (100GB వరకు, జూన్ 30, 2024 వరకు)

శాంసంగ్ గెలాక్సీ​ ఏ55 5G, గెలాక్సీ ఏ35 5G ఫోన్​లను Samsung.com సహా, అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల్లోనూ కొనుగోలు చేయవచ్చు.

ఇకపై వాట్సాప్‌ పేమెంట్స్‌ మరింత ఈజీ - చాట్‌ లిస్ట్‌లోనే QR కోడ్​!

ఇకపై మొబైల్ నంబర్ పోర్టింగ్​కు 7 రోజులు ఆగాల్సిందే - ట్రాయ్​ నయా రూల్- స్కామ్స్​ అరికట్టేందుకే!

Last Updated : Mar 20, 2024, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.