ETV Bharat / technology

దేశంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్- భారీ పెట్టుబడులతో ఇన్నోవేషన్‌ సెంటర్‌ కూడా..

'ఇంటెలిజెన్స్ మార్కెట్లలో అతిపెద్దదిగా భారత్..!- ఇదే మా లక్ష్యం'

Reliance and Nvidia Partnership
Reliance and Nvidia Partnership (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 25, 2024, 10:43 AM IST

Reliance and Nvidia Partnership: ఇండియాలో ఏఐ మౌలిక వసతులతో పాటు ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎన్విడియా ప్రకటించింది. ఈ మేరకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఏఐ సమ్మిట్‌లో ఎన్విడియా కార్ప్‌ సీఈఓ జెన్సెన్‌ హ్యూవాంగ్‌ వెల్లడించారు. ఇందుకోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెడతామని ఆయన స్పష్టం చేశారు.

భారత్​లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ ఎన్విడియా ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ కంపెనీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఇది రెండో అతిపెద్ద US కంపెనీ. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ మన ఇండియాలో అతిపెద్ద కంపెనీ. ఈ రెండు దిగ్గజ కంపెనీలు కలిసి సంయుక్తంగా భారత్​లో ఏఐ మౌలిక వసతులతో ఇన్నోవేషన్‌ సెంటర్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.

ఇండియాలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: ఇండియా జనాభాలో ఎక్కువ శాతం కంప్యూటర్ ఇంజనీర్లను కలిగి ఉంది. యుఎస్, చైనాతో పాటు భారత్​లో కూడా లార్జ్ డిజిటల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తే ఇండియా కంప్యూటింగ్ సామర్థ్యం సంవత్సరానికి దాదాపు 20 రెట్లు పెరుగుతుందని హ్యూవాంగ్‌ అన్నారు. తమ భాగస్వామ్యంలో భాగంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పలు అప్లికేషన్లను సృష్టించి, కస్టమర్లకు విక్రయిస్తుందని తెలిపారు.

"ఇండియాలోని ముడి డేటాను ఇంటెలిజెన్స్‌గా మార్చొచ్చు. దాన్ని ఒక మోడల్‌గా మార్చి సొంత డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ను తయారు చేయొచ్చు. ఎగుమతీ చేయొచ్చు. త్వరలోనే భారత్ ఏఐ సొల్యూషన్లను ఎగుమతి చేస్తుంది." - జెన్సెన్‌ హ్యూవాంగ్‌, ఎన్‌విడియా ఛైర్మన్‌

ఇంటెలిజెన్స్ మార్కెట్లలో అతిపెద్దదిగా భారత్..!: రిలయన్స్, ఎన్‌విడియా భాగస్వామ్యంతో దేశంలో అధునాతన ఏఐ మౌలిక వసతుల నిర్మాణం సాధ్యమవుతుందని అంబానీ అన్నారు. ఇంటెలిజెన్స్ మార్కెట్లలో అతిపెద్దదిగా భారత్ మారగలదని, ఇదే తమ లక్ష్యమని తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో ఇంటెలిజెన్స్‌ సాంకేతికతలో భారత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని పేర్కొన్నారు. భారత్‌ తన సొంత మోడల్‌ను అభివృద్ధి చేసుకోవడానికి ముందు మెటాకు చెందిన ఓపెన్‌ సోర్స్‌ లామాను వినియోగించుకోవాలని ముకేశ్‌ పిలుపునిచ్చారు.

"టెలికాం రంగం అభివృద్ధికి జియో దోహదపడింది. అదేవిధంగా ఎన్విడియా కూడా మెరుగైన AI మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది. రిలయన్స్, ఎన్విడియా గత సంవత్సరం భారత్​లో సూపర్ కంప్యూటర్లను తయారు చేస్తామని చెప్పాయి. ఇప్పుడు రెండు కంపెనీలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM)ని రూపొందిస్తామని హామీ ఇస్తున్నాయి." - ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ అధినేత

శాంసంగ్ ఫస్ట్ ట్రై-ఫోల్డ్ స్మార్ట్​ఫోన్- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

యాపిల్ లవర్స్​కు గుడ్​న్యూస్- ఐఫోన్​లో సరికొత్త ఫీచర్స్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.