Reliance Hanooman AI Model Launch : ఇండియాకు చెందిన 'భారత్ జీపీటీ' గ్రూప్ మార్చి నెలలో 'హనుమాన్' అనే ఏఐ మోడల్‌ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న చాట్‌జీపీటీ లాంటి సేవలనే ఇది అందించనుంది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా 8 యూనివర్సిటీలు - భారత్ జీపీటీ గ్రూప్ వెనుక ఉన్నాయి.
11 భాషల్లో
భారత్‌జీపీటీ ముంబయిలో జరిగిన టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో 'హనుమాన్' పేరుతో 'లార్జ్ లాంగ్వేజ్ మోడల్'ను ప్రదర్శించింది. ఈ హనుమాన్ ఏఐ మోడల్ 11 భాషల్లో విద్య, వైద్యం, ఆర్థిక, పరిపాల రంగాల్లో సేవలు అందిస్తుందని తెలిపింది.
టెస్టింగ్
ఈ హనుమాన్ ఏఐ మోడల్ పనితీరును తెలియజేసే వీడియోను కూడా భారత్‌జీపీటీ ప్రదర్శించింది. అందులో ఓ వ్యక్తి తమిళంలో ఏఐ బాట్‌తో మాట్లాడి సమాధానం రాబట్టారు. ఓ బ్యాంకర్ హిందీ భాషలో హనుమాన్ ఏఐతో చాట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కంప్యూటర్ కోడ్‌ను రాసేందుకు కూడా ఈ ఏఐ బాట్‌ను ఉపయోగించారు. ఈ హనుమాన్ ఏఐ మోడల్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కలిసి అభివృద్ధి చేశాయి.
యూజర్ ఫ్రెండ్లీ
హన్మాన్ ఏఐ మోడల్ ద్వారా స్పీచ్-టు-టెక్ట్స్ కూడా జనరేట్ చేయవచ్చు అని తెలుస్తోంది. దీన్ని ఆధారం చేసుకొని ప్రత్యేక అవసరాలకు కావాల్సిన మోడళ్లను రిలయన్స్ జియో అభివృద్ధి చేస్తోంది. రిలయన్స్ కంపెనీ ఇప్పటికే తమ సబ్‌స్క్రైబర్లకు ఏఐ సేవలను అందించేందుకు 'జియో బ్రెయిన్' పేరిట ఓ మోడల్‌ను తయారు చేస్తోంది.
మరిన్ని ఏఐ మోడల్స్
లైట్ స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్ బ్యాకప్‌తో నడుస్తున్న సర్వం అండ్ క్రుట్రిమ్, వినోద్ ఖోస్లా ఫండ్ లాంటి స్టార్టప్‌లు కూడా భారత్‌లో ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ రూపొందించడానికి కృషి చేస్తున్నాయి.
ఏఐ రేస్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్స్ రూపకల్పన జరుగుతోంది. చాట్‌జీపీటీ, జెమిని ఏఐ, ఎక్స్ (ట్విట్టర్) ఏఐ గ్రోక్ లాంటివి ప్రజల విశేష ఆదరణను పొందుతున్నాయి. భవిష్యత్‌లో ఇలాంటివి మరెన్నో వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో మానవాళికి పెనుముప్పు ఉందని వాదించేవారి సంఖ్యలో కూడా భారీగానే ఉండడం గమనార్హం.
వాట్సాప్ స్పెషల్ హెల్ప్‌లైన్‌తో 'డీప్‌ఫేక్స్'కు చెక్!
ఓపెన్ AI మరో సంచలనం- మ్యాటర్ ఇస్తే వీడియో రెడీ- ఎలా పనిచేస్తుందంటే?