Women Safety APPs in India: ఇప్పుడిప్పుడే వంటిట్లో నుంచి ఆడవాళ్లు బయటకు రావటం మొదలు పెట్టారు. మగవారికి ధీటుగా ఉద్యోగాలూ చేస్తున్నారు. అయితే కొంతమంది నైట్ షిఫ్ట్‌లో కూడా డ్యూటీ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు రాత్రి సమయంలో ఒంటరి ప్రయాణం మహిళలు, అమ్మాయిలకు అంత సేఫ్ కాదు. ఆకతాయిల అల్లర్లు, అగంతకుల దాడులు మహిళల రక్షణను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అలాంటి సమయంలో ఈ యాప్స్ ఫోన్లో ఉంటే ఎక్కడికెళ్లినా సేఫ్ అంటున్నారు నిపుణులు.
ఆపత్కాలంలో మహిళలను ఆదుకునే యాప్స్ ఇవే:
1. 112 APP: ఈ యాప్‌ను కేంద్ర హోంశాఖ రూపొందించింది. ఈ యాప్ ద్వారా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ పొందొచ్చు. ఆపత్కాలంలో ఈ యాప్ మీ దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌ను గుర్తించి వారికి సమాచారాన్ని అందిస్తుంది. దీంతో వెంటనే వారు సాయం చేసేందుకు వీలుంటుంది.
2. AP POLICE SEVA APP: ఏపీ పోలీస్ సేవా యాప్ సాయంతో అత్యవసర పరిస్థితుల్లో మీరు ఏపీ పోలీసులను కాంటాక్ట్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా మీ నుంచి సిగ్నల్ అందిన వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ నుంచి మీకు తక్షణ సాయం అందుతుంది.
3. HAWK EYE APP: ఈ హాక్ ఐ యాప్‌ను తెలంగాణ పోలీసులు రూపొందించారు. ఇది కూడా ఆపత్కాలంలో మహిళలకు రక్షణగా నిలుస్తుంది. అత్యవసర సమయంలో ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే దగ్గర్లో ఉన్న దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు, ఏసీపీకి, డీసీపీకి, పెట్రోలింగ్ వ్యాన్‌కు మీ వివరాలన్నీ చేరిపోతాయి. ఈ యాప్ ద్వారా వారు వెంటనే రంగంలోకి దిగి మీకు రక్షణ కల్పించేదుకు వీలుంటుంది.
4. RAKSHA APP: మొబైల్లో ఈ రక్ష యాప్ ఇన్స్టాల్ అయి ఉంటే మహిళలు, అమ్మాయిలు కాస్త సేఫ్‌గా ఫీలవొచ్చు. ఎందుకంటే ఒక్క బటన్ నొక్కగానే ఈ యాప్‌లో ముందుగానే సెలక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్‌కు లొకేషన్‌తో సహా వివరాలన్నీ తెలిసిపోతాయి. దీనికి ఇంటర్నెట్ లేకపోయినా వాల్యూమ్ బటన్ 3సార్లు ప్రెస్ చేయగానే సెలక్టెడ్ కాంటాక్ట్స్‌కు వివరాలు చేరిపోతాయి.
5. B-SAFE APP: ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్లు నటించేందుకు ఈ బీ సేఫ్ యాప్ ఉపయోగపడుతుంది. దీనిలో ఫేక్ కాల్ ఫీచర్ కూడా ఉండటంతో ఆపత్కాలంలో కాల్ మాట్లాడినట్లు నటిస్తూ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. దీంతోపాటు మీరు మొబైల్ బయటకు తీయలేని పరిస్థితుల్లో వాయిస్ కమాండ్ ద్వారా కూడా ఈ యాప్‌కు కమాండ్స్ ఇవ్వొచ్చు. మీ సన్నిహితులకు క్షణాల్లో లొకేషన్, ఆడియో, వీడియో వంటి వివరాలను ఈ యాప్ అందజేస్తుంది.
6. MY SAFETIPIN APP: ఈ సేఫ్టీ పిన్ యాప్ మీరు సేఫ్‌గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. రిస్కీ ఏరియాలో ఎంటర్ అయినప్పుడు ఇది నోటిఫికేషన్ పంపిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, పబ్లిక్ ప్లేసెస్, సెక్యూరిటీ, లైటింగ్ వంటి వివరాలు అందజేస్తుంది.
7. CHILLA APP: మీపై అకస్మాత్తుగా దాడి జరిగితే వెంటనే ఈ యాప్ గుర్తిస్తుంది. మీ వాయిస్‌ను గుర్తించి వెంటనే స్పందించి మీ సన్నిహితులకు అలెర్ట్ మెసేజ్ అందిస్తుంది. దీంతోపాటు పవర్ బటన్‌ను 5సార్లు ప్రెస్ చేస్తే మీ లొకేషన్‌తో సహా వివరాలన్నీ వారికి చేరిపోతాయి.
8. SMART24x7 APP: ఆపత్కాల సమయంలో ఈ యాప్ ఆడియో, వీడియో, ఫోటోలు రికార్డ్ చేసి పంపుతుంది. ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేస్తే మీరు ముందుగానే సెలక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్‌కు మీ వివరాలన్నీ చేరవేస్తుంది.
ఆఫీస్ కంప్యూటర్/ ఫోన్ల్లో ఈ పనులు చేశారో - ఇక అంతే సంగతులు! - What Not To Do On Company Laptop
'ఏఐలో 12.5 లక్షల ఉద్యోగాలు'- ఈ స్కిల్స్ నేర్చుకో జాబ్ పట్టుకో! - JOBS IN ARTIFICIAL INTELLIGENCE