How To Send Large Files Through Gmail : నేటి కాలంలో జీ-మెయిల్ తెలియని వారు లేరంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. గూగుల్ కంపెనీకి చెందిన ఈ జీ-మెయిల్‌ను నేడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. క్వాలిటీ మిస్ కాకుండా ఫొటోలు పంపించాలన్నా, ముఖ్యమైన ఫైల్స్, డాక్యుమెంట్లు సెండ్ చేయాలన్నా చాలా మంది జీ-మెయిల్‌నే వాడుతుంటారు. అయితే జీ-మెయిల్లో 25 MB కన్నా పెద్ద సైజు ఉన్న ఫైల్స్‌ను పంపేందుకు వీలుపడదు. కానీ ఒక చిన్న ట్రిక్ వాడితే చాలు, చాలా పెద్ద ఫైల్స్‌ను అయినా చాలా ఈజీగా జీ-మెయిల్ ద్వారా పంపించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
జీమెయిల్లో పెద్ద సైజ్ ఫైల్స్ ఎలా పంపించాలి?
How To Send Large Files In Gmail :
- ముందుగా మీరు పంపించాలనుకుంటున్న ఫైల్/ డాక్యుమెంట్/ ఫొటో/ వీడియోలను గూగుల్ డ్రైవ్‌లోకి అప్లోడ్ చేయాలి.
- మెయిల్ పంపే సమయంలో స్క్రీన్ కుడివైపున కనిపించే 'డ్రైవ్' ఐకాన్ ఎంచుకోవాలి. డెస్క్‌టాప్‌లో అయితే ఈ ఐకాన్ కింద ఉంటుంది.
- ఐకాన్‌ను క్లిక్ చేయగానే 2 ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ‘Insert from Drive’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తరువాత దానిలోని ‘My Drive’ను ఎంచుకోవాలి.
- వెంటనే మీరు గూగుల్ డ్రైవ్‌లోకి అప్లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి.
- వాటిలోంచి మీరు పంపించాలనుకుంటున్న లార్జ్ ఫైల్‌ని ‘Select’ చేసుకోవాలి.
- వెంటనే మీరు సెలెక్ట్ చేసిన ఫైల్‌కు సంబంధించిన లింక్‌ను గూగుల్ క్రియేట్ చేస్తుంది. దానిని ఆటోమెటిక్‌గా ఈ-మెయిల్‌కి పంపిస్తుంది.
- మెయిల్ పంపించే ముందు, లింక్‌ను కేవలం అందుకున్నవారు మాత్రమే యాక్సెస్ చేయాలా? లేదా ఎవరైనా యాక్సెస్ చేయవచ్చా? అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
- మీకు నచ్చిన దాన్ని ఎంచుకుని మెయిల్ సెండ్ చేసేయండి. అంతే సింపుల్!
ఎనేబుల్ యాక్షన్ కన్ఫర్మేషన్ : జీమెయిల్ వాడేవారు, అప్పుడప్పుడు పొరపాటున 'మెయిల్ సెండ్' బటన్ నొక్కేస్తుంటారు. అయితే ఇలా పొరపాటున పంపిన మెయిల్‌ను డిలీట్ లేదా ఆర్కైవ్ చేసుకునే ఆప్షన్ జీమెయిల్లో ఉంది. అది ఎలా అంటే?
- మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లో జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి మూడు చుక్కల బటన్‌పై నొక్కండి.
- సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ సెట్టింగ్స్‌ను ఎంచుకోండి.
- యాక్షన్ కన్ఫర్మేషన్ కోసం కిందికి స్క్రోల్ చేయండి.
- మీ ప్రాధాన్యతలను బట్టి డిలీట్/ ఆర్కైవ్/ సెండ్ మెయిల్ ఆప్షన్లను ఎంచుకోండి.
హ్యాకర్స్ నుంచి Wifiను కాపాడుకోవాలా? ఈ 6 టిప్స్ మీ కోసమే! - How To Protect Wifi From Hackers