ETV Bharat / technology

ఇల్లు ఊడ్చి, చక్కగా తుడిచే రోబో క్లీనర్ - మీరు చెప్పినట్టు వింటుంది! - ధర కూడా తక్కువే! - Robot Vacuum Cleaners

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 4:54 PM IST

Robot Vacuum Cleaners: ప్రతిరోజు ఇల్లు ఊడిచి, తడిగుడ్డ వేసి అలసిపోతున్నారా. అయితే మీరు వీటి గురించి తెలుసుకుని తీరాల్సిందే. ఇవి మీకు శ్రమ లేకుండా ఇంటిని సూపర్ ఫాస్ట్ గా శుభ్రం చేసేస్తాయి. అంతేకాదు ఇంటిలోని ప్రతి మూలను మెరిపిస్తుంది. ఇంతకీ అవి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

Robot Vacuum Cleaners
Robot Vacuum Cleaners (ETV Bharat)

How to Operate Robot Vacuum Cleaners: మహిళలకు వంట పని తర్వాత ఇబ్బంది కలిగే పని అంటే ఇళ్లు క్లీనింగ్​. ఎందుకంటే ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. సోఫా కింద, మంచం కింద, బీరువాల కింద వంగి ఊడవాలన్నా, తడిగుడ్డ పెట్టాలన్నా చాలా కష్టం. ఇక ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్​లో ఒక పక్క ఉద్యోగాలు చేసుకుంటూ.. మరో పక్క పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులు చేయడం అంటే పని భారం మామూలుగా ఉండదు. పని చేసే ఓపిక ఉన్నా సమయం ఉండదు. ఒక్కోసారి సమయం ఉన్నా.. పనులు చేసేందుకు ఓపిక ఉండదు. అయితే వీటన్నింటికి చెక్​ పెట్టేందుకు మీకోసం ఒక అద్భుతమైన ప్రొడక్ట్ వచ్చేసింది. అదే "రోబో వ్యాక్యూమ్​ క్లీనర్​". మీరు రిమోట్​తో ఆపరేట్ చేస్తే చాలు.. దాని పని అది చేసుకుంటుంది. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? దీని వల్ల ఏఏ పనులు పూర్తవుతాయి వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

బట్టలు ఉతకడానికి వాషింగ్​ మెషీన్లు, గిన్నెలు శుభ్రం చేయడానికి డిష్​ వాషర్లు, ఇంటిని శుభ్రం చేయడానికి వ్యాక్యూమ్​ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆల్​రెడీ వాక్యూమ్​ క్లీనర్లు ఉన్నాయి కాదా.. మళ్లీ ఈ రోబో క్లీనర్లు ఎందుకూ అనే డౌట్​ మీకు రావచ్చు. అయితే వ్యాక్యూమ్​ క్లీనర్లను మనం ఆపరేట్​ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లోని దుమ్ము, చెత్తను తొలగించడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఇళ్లు తుడవాలంటే మాప్​లు ఉపయోగించాల్సిందే. అదే ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ ఆటోమేటిక్​గా పనిచేస్తుంది. ఇది కూడా ఇంట్లోని దుమ్ము, చెత్తను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీటిలోని పలు మోడల్స్​ ఇల్లు ఊడ్చేసి తడిగుడ్డ కూడా పెట్టేస్తాయి.

ప్రయోజనాలు చూస్తే:

  • ఆటోమెటిక్​గా శుభ్రం చేయడం: సాధారణంగా వ్యాక్యూమ్​ క్లీనర్ల వెంట మనం ఉండాల్సిందే. కానీ వీటికి మనం వెంట ఉండనవసరం లేదు. జస్ట్​ ఆన్​ చేస్తే చాలు ఇవి స్వయంగా ఇంటిని శుభ్రం చేస్తాయి.
  • అన్ని రకాల నేలలపై పని చేస్తాయి: కార్పెట్లు, టైల్స్, లామినేట్ ఫ్లోరింగ్ వంటి అన్ని రకాల నేలలపై ఇవి సమర్థవంతంగా పని చేస్తాయి.
  • చెత్తను సేకరించడం: చిన్న చిన్న ముక్కలు, జుట్టు, బిస్కెట్​ ముక్కలు ఇలా ఒక్కటేమటి అన్ని రకాల చెత్తను సులభంగా సేకరించి అందులోనే స్టోర్​ చేసుకుంటాయి. తర్వాత దాని నుంచి చెత్తను తీసివేస్తే సరి.
  • షెడ్యూల్ చేయడం: మనం నచ్చిన సమయంలో ఆటోమేటిక్‌గా శుభ్రం చేయడానికి షెడ్యూల్ చేయవచ్చు.
  • అధునాతన ఫీచర్లు: కొన్ని రోబో వాక్యూమ్ క్లీనర్‌లలో మ్యాపింగ్​​, వాయిస్ కమాండ్‌లు, అప్లికేషన్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి.

శత్రువులను ఖతం చేసే 'AI రోబో'- ఎనిమీ ఎక్కడ ఉన్నా గురితప్పదు! యుద్ధభూమిలో 360 డిగ్రీల కవరేజ్​!

ఎలా ఆపరేట్​ చేయాలి:

  • ముందుగా ఛార్జింగ్​ పెట్టాలి. ఆ తర్వాత బటన్​ ప్రెస్​ చేస్తే ఆన్ అవుతుంది. లేదా రిమోట్​ ద్వారా కూడా ఆపరేట్​ చేయవచ్చు.
  • కొన్ని క్లీనర్లకు మొబైల్​ యాప్​ ద్వారా ఆదేశాలు ఇవ్వొచ్చు.. మరికొన్ని వాయిస్​ కమాండ్​ ద్వారా ఆపరేట్​ చేయొచ్చు.
  • ఫోన్లో యాప్‌ ద్వారా టైమ్ సెట్‌ చేస్తే చాలు.. ప్రతిరోజూ ఆ టైమ్‌ ప్రకారం వాటంతటవే పని చేస్తాయి.
  • మనం ఇంట్లోలేకున్నా వాటిని ఆపరేట్‌ చేయొచ్చు.
  • అలాగే వాటిని ఉపయోగించేటప్పుడు క్లీనింగ్​ మోడ్​లను ఎంచుకోవచ్చు. అంటే..
  • ఆటో మోడ్: క్లీనర్ స్వయంగా ఇంటిని స్కాన్ చేసి క్లీన్ చేస్తుంది.
  • స్పాట్ క్లీనింగ్: ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని క్లీన్ చేయడానికి ఈ మోడ్ ఆన్ చేయాలి.
  • ఎడ్జ్ క్లీనింగ్: గోడల వెంబడి క్లీన్ చేయడానికి.
  • షెడ్యూల్ క్లీనింగ్: ముందే నిర్ణయించిన సమయం ప్రకారం క్లీనర్ స్వయంగా ఆన్ అవుతుంది. పని చేస్తూ వెళ్తుంది.
  • మీకు కావాల్సిన క్లీనింగ్ మోడ్‌ను ఎంచుకున్న తర్వాత.. స్టార్ట్ బటన్ లేదా యాప్/రిమోట్ ద్వారా ఆన్​ చేస్తే క్లీనర్ తన పనిని ప్రారంభిస్తుంది.
  • క్లీనింగ్​ పూర్తయిన తర్వాత.. అది ఆటోమెటిక్​గా ఛార్జింగ్ డాక్‌కు తిరిగి వెళుతుంది. ఆ తర్వాత పవర్​ ఆఫ్​ చేస్తే సరి. కొన్ని క్లీనర్స్ ఆటోమెటిక్​గా అవే ఆఫ్​ అయిపోతాయి.

ఎక్కడ లభిస్తాయి?: ప్రస్తుతం ఈ రోబో వ్యాక్యూమ్​ క్లీనర్లు ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థలలో అందుబాటులో ఉన్నాయి. ఫీచర్స్​ను బట్టి ధరలు ఉంటాయి. అలాగే ప్రముఖ కంపెనీలు వీటిపై ఆఫర్స్​ కూడా ప్రకటిస్తున్నాయి. యంత్రాల్లా ఉండే వీటిల్లో ఇంటి అవసరాల్ని బట్టి మనకు కావలసినదాన్ని ఎంచుకోవచ్చు, పనుల భారాన్ని తగ్గించుకోవచ్చు.

I'm not a robot గురించి తెలుసా? అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఏఐ హ్యూమనాయిడ్ రోబోస్ వచ్చేస్తున్నాయ్​ - మానవాళికి పెనుముప్పు తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.