ETV Bharat / technology

మీ ఫోన్‌ తరచూ హ్యాంగ్‌ అవుతోందా? ఈ టిప్స్‌ ట్రై చేయండి! - How To Fix Phone Hanging Issue

How To Fix Phone Hanging Issue : మీ ఫోన్‌ తరచూ హ్యాంగ్‌ అవుతోందా? పైగా చాలా నెమ్మదిగా వర్క్‌ చేస్తోందా? అయితే ఇది మీ కోసమే. ఫోన్ హ్యాంగింగ్​ సమస్యను చాలా సులువుగా ఫిక్స్ చేసే కొన్ని సింపుల్​ ట్రిక్స్ & టిప్స్​ గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Phone Hang Solution
phone hang and freeze issue (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 18, 2024, 12:03 PM IST

How To Fix Phone Hanging Issue : ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఫోన్​, ఒక్కోసారి ముఖ్యమైన వ్యక్తులతో సంభాషిస్తున్నప్పుడు ఆగిపోతుంటుంది. ఎవరికైనా అత్యవసరంగా మెసేజ్‌ పంపాలనుకున్నప్పుడు హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. ఫోన్‌ ఇలా హఠాత్తుగా నిలిచిపోతుంటే మనకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్​లో ఫోన్ హ్యాంగింగ్ సమస్యను చాలా సులువుగా ఫిక్స్ చేసే టిప్స్ & ట్రిక్స్​ గురించి తెలుసుకుందాం.

  1. డిలీట్‌ : మనకు తెలియకుండానే ఫోన్‌లోని స్టోరేజీ ఫుల్‌ అయిపోతుంటుంది. ఇలా ఫోన్​ కెపాసిటీకి దగ్గరగా స్టోరీజ్​ నిండిపోతే, ఫోన్‌ నెమ్మదించడం, హ్యాంగ్‌ అవ్వడం సహజమే. అందువల్ల మీ డివైజ్​లోని అనవసరపు వీడియోలు, ఫొటోలు, ఫైల్స్​ను డిలీజ్‌ చేయడం మంచిది.
  2. అన్‌ఇన్‌స్టాల్‌ : ఏదో అవసరం అంటూ కొన్ని యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. అవసరం తీరాక దాన్ని తొలగించడం మర్చిపోతుంటాం. ఇలా మనకు తెలియకుండానే ఫోన్‌లో వాడని యాప్స్‌ చాలానే ఉంటాయి. కనుక అలాంటి వాటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేయడం ఉత్తమం.
  3. క్లియర్‌ క్యాచీ : కొన్ని సార్లు యాప్‌లు నిక్షిప్తం చేసుకున్న క్యాచీ ఫైల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇది కూడా మొబైల్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు క్యాచీ ఫైల్స్​ను తొలగిస్తూ ఉండాలి. ఇందు కోసం settings లోకి వెళ్లి storage ఆప్షన్​ను ఎంచుకోవాలి. అనంతరం Apps లోకి వెళ్లి, సంబంధిత యాప్‌ను సెలక్ట్‌ చేయగానే, క్లియర్‌ క్యాచీ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.
  4. అప్‌డేట్‌ : స్మార్ట్​ డివైజ్​ల్లో తరచూ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేస్తూ ఉండడం మంచిది. దీని వల్ల ఫోన్‌లో సరికొత్త ఫీచర్లు వచ్చి చేరుతుంటాయి. ఫలితంగా ఫోన్‌ వేగం కూడా పెరుగుతుంది. సాఫ్ట్​వేర్​ అప్​డేట్ చేయడం మాత్రమే కాదు, హోం స్క్రీన్‌పై ఉండే అనవసర విడ్జెట్‌లను కూడా తొలగించాలి. ఎందుకంటే ఈ విడ్జెట్లు కూడా ఫోన్‌ హ్యాంగ్‌ అవ్వడానికి కారణం అవుతుంటాయి.
  5. మాల్‌వేర్‌ చెక్‌ : వైరస్‌ డిటెక్టింగ్‌ యాప్‌లు ఫోన్‌కు రక్షణను అందిస్తాయి. యాంటీ వైరస్​ యాప్​లను ఇన్‌స్టాల్‌ చేస్తే, వైరస్​ ఎటాక్ జరిగినప్పుడు సులువుగా గుర్తించడానికి, దానిని తొలగించడానికి వీలవుతుంది. ఫలితంగా మీ ఫోన్‌ సురక్షితంగా ఉంటుంది.
  6. రీస్టార్ట్‌ : ఫోన్‌ హ్యాంగ్‌ అయినప్పుడు, దానిని రీస్టార్ట్‌ చేయడం మంచిది. ఇలా రీస్టార్ట్‌ చేయడం వల్ల ఫోన్‌లోని అప్లికేషన్స్‌ రీసెట్‌ అవుతాయి. ఫలితంగా ఫోన్​ సరిగ్గా పనిచేయడానికి వీలు ఏర్పడుతుంది.

మీ గూగుల్‌ స్టోరేజీ తరచూ నిండిపోతోందా? డోంట్‌ వర్రీ - సింపుల్‌గా క్లీన్ చేసుకోండిలా! - Google storage full

స్పామ్ కాల్స్​/మెసేజ్​లతో విసిగిపోయారా? ట్రాయ్ DND యాప్​లో ఫిర్యాదు చేయండిలా! - How To Complain About Spam Calls

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.