ETV Bharat / technology

నంబర్స్​ డిస్​కనెక్ట్​ అంటూ ఫేక్​ కాల్స్- పౌరులకు కేంద్రం వార్నింగ్​- అక్కడ రిపోర్ట్​ చేయాలని సూచన - Centre Issues Advisory Fraud Calls - CENTRE ISSUES ADVISORY FRAUD CALLS

Centre Issues Advisory Fraud Calls : కేంద్ర టెలికమ్యూనికేషన్స్​ విభాగం పేరిట వస్తున్న మోసపూరిత కాల్స్​ గురించి ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఇలాంటి ఫేక్​ కాల్స్​పై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇలా ఎవరైనా మోసపూరిత కాల్స్​ చేస్తే ఎక్కడ రిపోర్ట్ చేయాలనే విషయాలు చెప్పింది. ఆ వివరాలు మీకోసం.

Centre Issues Advisory Fraud Calls
Centre Issues Advisory Fraud Calls
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 2:36 PM IST

Centre Issues Advisory Fraud Calls : దేశ పౌరులకు శుక్రవారం అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర సమాచార శాఖ. మొబైల్​ నంబర్లను డిస్​కనెక్ట్​ చేస్తామంటూ తమ పేరుతో పౌరులకు బెదిరింపు సందేశాలు పంపుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని డాట్​ హెచ్చరించింది. యుజర్ల నంబర్లను కొన్ని చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా విదేశీ నంబర్​ల (ఉదాహారణ : +92-xxxxxxxxxx వంటివి) నుంచి వాట్సాప్​ కాల్స్​ చేస్తూ, తాము ప్రభుత్వాధికారులమంటూ మోసం చేస్తున్నారని పేర్కొంది.

ఇలాంటి మోసపూరిత కాల్స్​ ద్వారా సైబర్​ నేరగాళ్లు సైబర్​ క్రైమ్/ ఆర్థిక నేరాలకు పాల్పడేందుకు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పింది. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. కేంద్ర టెలికమ్యూనికేషన్​ విభాగం నుంచి ఇలాంటి కాల్స్​ చేసేందుకు ఎలాంటి అనుమతి ఉండదని తెలిపింది. ఎవరు ఫోన్​ చేసినా ఎలాంటి సమాచారాన్ని వారికి చెప్పకూడదని సూచించింది.

ఇలా ఫిర్యాదు చేయండి
ఇలాంటి మోసపూరిత కాల్స్​ వచ్చినప్పుడు సంచార్​ సాథీ- చక్షు పోర్టల్​లో నివేదించాలని డాట్​ సూచించింది. ఇలా చేయడం వల్ల సైబర్​ నేరాలు, ఆర్థిక మోసాల కోసం టెలికాం వనరుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుందని చెప్పింది. ఇక ఈ పోర్టల్​లో ఎవరి పేరు మీద ఎన్ని మొబైల్​ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చని తెలిపింది. ఒకవేళ అందులో ఏదైనా కనెక్షన్​ మీరు తీసుకోకుంటే రిపోర్ట్​ చేయొచ్చని చెప్పింది. అంతేకాకుండా ఏదైనా సైబర్​ క్రైమ్​ గురించి రిపోర్ట్ చేయడానికి 1930 హెల్ప్​లైన్​ నంబర్​కు కాల్​ చేయొచ్చని వెల్లడించింది. సైబర్​ క్రైమ్​ బాధితులు www.cybercrime.gov.inలో రిపోర్ట్​ చేయాలని చెప్పింది.

'చక్షు' ఏం చేస్తుంది?
సైబర్​ మోసాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు 'చక్షు' (హిందీలో కన్ను అని అర్థం) అనే పోర్టల్​ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజలు తమకు వచ్చిన అనుమానిత కాల్స్​, ఎస్ఎంఎస్​, వాట్సాప్​ మెసెజ్​లు గురించి ఇందులో రిపోర్ట్ చేయవచ్చు. చక్షు పోర్టల్​లో ఇలా ఫిర్యాదు చేసిన వెంటనే, ​మీ ఫోన్ నంబర్​ను ధ్రువీకరించమని చెబుతుంది. మీరు మీ ఫోన్​ నంబర్​ను కచ్చితంగా చెప్పి, ధ్రువీకరించాల్సి ఉంటుంది. దీనితో మీ రిపోర్ట్​ను తీసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. మీకు తగిన సాయం చేస్తుంది.

'సిరి' ఇక సూపర్ స్మార్ట్- iOS18లో అదిరే ఫీచర్స్- పూర్తి వివరాలు తెలిసేది ఆరోజే! - Apple WWDC Event 2024

గుడ్​ న్యూస్​ - 'X' ప్రీమియం యూజర్లకు​ త్వరలోనే 'గ్రోక్'​ ఏఐ యాక్సెస్​! - Grok AI For All X Premium Users

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.