Botsa Satyanarayana Hugs Deputy CM Pawan Kalyan: శాసనసభ ప్రాంగంణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కారెక్కేందుకు వస్తుండగా అది చూసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుగా వెళ్లి పవన్‌ని పలకరించేదుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ నేతలు పెద్దిరెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్‌కు బొత్స సత్యనారాయణ నమస్కారం పెట్టారు.
బొత్స స్పందనను చూసిన పవన్ కల్యాణ్ ఆయనకు ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు. బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టారు. జరుగుతున్న పరిణామాల్ని దూరం నుంచి చూస్తూ వైఎస్సార్సీపీ నేతలు అయోమయంలో పడ్డారు. వాళ్లిద్దరినీ చూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖం తిప్పుకుని వెళ్లిపోయారు.
సోషల్ మీడియాలో ట్రెండ్: ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు బొత్స వైఎస్సార్సీపీని వీడి జనసేనలో చేరుతున్నారని ప్రచారం చేస్తున్నారు. మరి కొందరు ఉన్న మిగతా వారు కూడా జగన్‌ను వీడే రోజులు తొందర్లోనే ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. దీనికి వైఎస్సార్సీపీ నేతల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ ఎలాంటి స్పందన రావట్లేదు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ప్రభాస్ ఎవరో నాకు తెలియదు - నేను ఇంత వరకూ ఆయన్ను చూడలేదు : షర్మిల
తప్పు చేసి 'సారీ' అంటే ఊరుకుంటామా? - ఏ ఒక్కరినీ వదిలేదిలేదు : లోకేశ్