ETV Bharat / state

ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు - అడ్డొచ్చిన వారిపై దాడులు - YSRCP Leaders Attack TDP Leaders - YSRCP LEADERS ATTACK TDP LEADERS

YSRCP Leaders Attacked TDP Leaders in Joint Kurnool District: రాష్ట్ర వ్యాప్తంగా​ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా పలుచోట్ల వైసీపీ నాయకుల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దొంగఓట్లు వేయడానికి యత్నించడమే కాకుండా అడ్డుకున్న టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారు.

ysrcp_leaders_attack_tdp_leaders
ysrcp_leaders_attack_tdp_leaders (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 6:36 PM IST

YSRCP Leaders Attacked TDP Leaders in Joint Kurnool District: కర్నూలులో ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. శ్రీరామ నగర్ పోలింగ్ బూత్ వద్ద మరియు సిల్వర్ జూబ్లీ కళాశాల వద్ద వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులను అక్కడి నుంచి పంపివేశారు. దాడి చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలులో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు తన ఓటు హక్కును పంచలింగాల గ్రామంలో వినియోగించుకోగా కర్నూలు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి రామయ్య కర్నూలులోని గణేష్ నగర్​లో తన ఓటు హక్కును నియమించుకున్నారు. కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు తన ఓటు హక్కును సిల్వర్ జూబ్లీ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి వేశారు. కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

టీడీపీ Vs వైఎస్సార్సీపీ - రణరంగంగా మారిన కడప జిల్లా - tdp ysrcp clashes in ysr kadapa

Pattikonda Constituency: ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం మల్లేపల్లిలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం జి. లింగాపురంలో టీడీపీ- వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆదోనిలో ఓటరు స్లిప్​పై తన ఫొటో ముద్రించి పంపిణీ చేస్తున్నారని వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. బనగానపల్లి నియోజకవర్గం అవుకు మండలం రామవరంలో టీడీపీ-వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువురినీ బయటకు పంపించారు.

Yemmiganur constituency: ఎమ్మిగనూరు పట్టణంలోని 130, 135 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఓటర్లు వర్షంలో ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటు వేసేందుకు వచ్చారు. ఈవీఎంలు మొరయింపుతో గంట సేపు పోలింగ్ కేంద్రాల వద్ద నీరిక్షించారు. పోలింగ్ సరళిని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పరిశీలించారు. ఈవీఎంలు మొరయింపును అధికారులు దృష్టికి తీసుకెళ్లారు.

సమస్యలు పరిష్కరిస్తేనే ఓటు వేస్తాం - ఎన్నికలు బహిష్కరించిన ప్రజలు - People Boycotted Voting

Adoni constituency: ఆదోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ స్లిప్​పై తన ఫోటో ఉన్న ఓటు స్లిప్​లను పంపిణీ చేశారు. ఫోటోతో ముద్రణ వలన ఓటర్లు ప్రభావితం ఆవకాశం ఉంది. ఓట్ స్లిప్లులు సామాజిక మధ్యమలో వైరల్​గా మారాయి. పురపాలక కమిషనర్ రామచంద్రరెడ్డి ఫిర్యాదుతో రెండో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని సీఐ గోపి తెలిపారు.

Dhone Constituency: నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు దండాలు పెడుతూ ప్రభావితం చేస్తున్నారని గుర్తు చేశారు. బేతంచర్లలో ఆయన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఇదే నియోజకవర్గంలోని ప్యాపిలి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణమూర్తిపై చేయి చేసుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనవసరంగా మా వారిపై చేయి చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.

Nandikotkur Constituency: నందికొట్కూరు నియోజకవర్గంలో తెల్లవారుజామున నుంచి ఓటర్లు తమ ఓటును వినియోగించుకునేందుకు బారులు తీరారు. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ఆలస్యంగా కొనసాగింది. ముచ్చుమర్రి, పాములపాడు, మద్దూరు గ్రామాల్లో ఈవీఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది.

కుప్పంలో వైఎస్సార్సీపీ అరాచకం - పోలింగ్​ బూత్​ తలుపులు మూసిన భరత్ - YSRCP Attack on TDP Agents

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.