ETV Bharat / state

చిలకలూరిపేటలో మల్లెల అనుచరుల ఆందోళన - టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 2:01 PM IST

YSRCP Leader Mallela Rajesh Naidu Followers Protest: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మల్లెల రాజేశ్ నాయుడుకు టికెట్ ఇవ్వకపోవడంపై జాతీయ రహదారిపై ఆయన అనుచరుల ఆందోళన చేపట్టారు. మల్లెల రాజేశ్ నుంచి మంత్రి రజిని, సజ్జల 6.5 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

YSRCP_Leader_Mallela_Rajesh_Naidu_Followers_Protest

YSRCP Leader Mallela Rajesh Naidu Followers Protest: చిలకలూరిపేటలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మల్లెల రాజేశ్ నాయుడుకు టికెట్ ఇవ్వకపోవడంతో జాతీయ రహదారిపై ఆయన అనుచరుల ఆందోళనకు దిగారు. కాగా మంగళవారం రాజేశ్​ను తప్పంచి మనోహర్ నాయుడును ఇన్​ఛార్జ్​గా వైసీపీ అధిష్ఠానం నియమించింది.

మల్లెల రాజేశ్‌ నాయుడు సంచలన వ్యాఖ్యలు: మల్లెల రాజేశ్‌ నాయుడు మంగళవారం వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్త వ్యాఖ్యలు చేశారు. మంత్రి రజిని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే రాజేశ్​ను తప్పించి వేరే వారికి టికెట్ ఇస్తారని ప్రచారం మొదలవడంతో, ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

మంత్రి విడదల రజిని తన వద్ద 6.5 కోట్ల రూపాయలు తీసుకున్నారని రాజేశ్​ ఆరోపించారు. డబ్బుల విషయమై సజ్జల రామకృష్ణా రెడ్డికి చెబితే, కేవలం 3 కోట్ల రూపాయలు వెనక్కు ఇప్పించారని, మిగతా డబ్బులు ఇవ్వకుండా మంత్రి రజని తనను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సజ్జలను మార్చండి - పార్టీని బతికించండి - రూ. 6.5 కోట్లు తీసుకున్నారు

రాజేశ్​కు వైసీపీ తొలి జాబితాలోనే చిలకలూరిపేట సమన్వయకర్తగా నియమించారు. అప్పటి వరకూ అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రజినిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. తాజాగా రాజేశ్‌ చేసిన వ్యాఖ్యలతో ఆయనను పక్కన పెట్టి గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడిని సమన్వయకర్తగా మంగళవారం వైసీపీ అధిష్ఠానం నియమించింది.

దీంతో రాజేశ్​ను సమన్వయకర్తగా తొలగించడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ అధిష్ఠానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా జాతీయ రహదారిపై రాజేశ్ నాయుడు అనుచరుల ఆందోళన చేపట్టారు.

వైఎస్సార్సీపీ 12వ జాబితా - చిలకలూరిపేట, గాజువాక ఇన్​ఛార్జ్​ల ప్రకటన

సజ్జల, రజినిపై కేసు నమోదు చేయాలి : ఎన్నికల్లో ఓటమి ఖాయమని టిక్కెట్ల దుకాణానికి జగన్ రెడ్డి గ్యాంగ్ తెర లేపిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీట్లు అమ్ముకుంటూ కోట్లు వెనకేసుకుంటూ అవినీతి సొమ్ముతో నెగ్గుకు రావచ్చని పగటి కలలు కంటున్నారని ఆయన మండిపడ్డారు. ఒక వైపు ఓటర్లకు గిఫ్టులు పంచుతూ మరో వైపు అభ్యర్ధుల దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటున్నారని దుయ్యబట్టారు.

మల్లెల రాజేశ్ నాయుడు నుంచి మంత్రి రజిని, సజ్జల 6.5 కోట్లు తీసుకోవడం సిగ్గుచేటని అన్నారు. సజ్జల లాంటి వారిని పెట్టుకొని జగన్ రెడ్డి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సజ్జల అభ్యర్ధుల నుంచి దాదాపు 1,000 కోట్లు వసూలు చేసి తాడేపల్లి ప్యాలెస్​కి పంపారని అన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి విడదల రజనీపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి: రామకృష్ణారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.