ETV Bharat / state

వైఎస్సార్సీపీ పార్లమెంటు, అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ల ఆరో జాబితా విడుదల

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 8:29 PM IST

Updated : Feb 2, 2024, 9:45 PM IST

YSRCP INCHARGES 6TH LIST: పార్లమెంట్‌, అసెంబ్లీ వైకాపా ఇన్‌ఛార్జిల మార్పు కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్​ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు జాబితాలను విడుదల చేసిన వైఎస్సార్సీపీ, శుక్రవారం రాత్రి నాలుగు పార్లమెంట్‌, 6 అసెంబ్లీ స్థానాలకు 10 పేర్లతో ఆరో జాబితాను ప్రకటించింది.

YSRCP INCHARGES 6TH LIST
YSRCP INCHARGES 6TH LIST

YSRCP INCHARGES 6TH LIST: పార్టీ ఇన్​ఛార్జీల మార్పులతో తాజాగా ఆరో జాబితాను వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ప్రకటించింది. ఇప్పటికే ఐదు జాబితాలు ప్రకటించి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన వైఎస్సార్సీపీ తాజా జాబితాలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యేపై వేటు వేసింది. నాలుగు పార్లమెంట్​, 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్​ఛార్జ్​లను ప్రకటించింది.

పార్లమెంట్​ నియోజకవర్గాలు :

  • నర్సాపురం పార్లమెంట్​ నియోజకవర్గం - గూడూరి ఉమాబాల
  • గుంటూరు పార్లమెంట్​ నియోజకవర్గం - ఉమ్మారెడ్డి రమణ
  • రాజమండ్రి పార్లమెంట్​ నియోజకవర్గం - గూడూరి శ్రీనివాస్‌
  • చిత్తూరు పార్లమెంట్​ నియోజకవర్గం - రెడ్డప్ప

అసెంబ్లీ​ నియోజకవర్గాలు :

  • జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం - నారాయణస్వామి
  • నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం - ఎండీ ఖలీల్‌
  • ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం - బుట్టా రేణుక
  • మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం - తిరుపతిరావు
  • మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం - అన్నా రాంబాబు
  • గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం - నాగార్జునరెడ్డి

కృష్ణా జిల్లా మైలవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను సీఎం జగన్ పక్కన పెట్టారు. మైలవరం అసెంబ్లీ నియోజక వర్గ ఇన్​ఛార్జిగా సర్నాల తిరుపతిరావు యాదవ్ ను సీఎం జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం మైలవరం జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న తిరుపతి యాదవ్ ను ఎంపీ కేశినేని నాని, మంత్రి జోగి రమేష్ తో చర్చించి ఇన్​ఛార్జిగా నిర్ణయించారు.

ప్రకాశం జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలను పరస్పరం మార్చారు. మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న కె. నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు పంపారు. గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబును మార్కాపురానికి మార్చారు. ఇవాళ ఇరువురు ఎమ్మెల్యేలతో చర్చించిన సీఎం అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదన్ ను ఇప్పటికే నరసారావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా పంపగా, నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా నెల్లూరు సిటీ డిప్యూటీ మేయర్ గా ఉన్న ఎండీ ఖలీల్ ను ప్రకటించారు.

వైఎస్సార్సీపీ ఇన్​ఛార్జుల ఐదో జాబితా విడుదల

చిత్తూరు పార్లమెంట్​ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా వెళ్లేందుకు నిరాకరించి ఆందోళనలు చేయించిన మంత్రి నారాయణ స్వామి తిరిగి ఆయన స్థానం జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజక వర్గ ఇన్​ఛార్జిగా పట్టుబట్టి సాధించారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​ఛార్జిని మరో సారి సీఎం మార్చారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సన్నిహితుడైన వెంకటేష్ ను ఇప్పటికే ప్రకటించిన సీఎం జగన్ తాజాగా ఆయన్ను మార్చేశారు. మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా ప్రకటించారు.

రాజమహేంద్ర వరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా గూడూరి శ్రీనివాస్​ను, నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా అడ్వకేట్ గూడూరి ఉమాబాలను ప్రకటించారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా ఉమ్మారెడ్డి వెంకటరమణను తెరపైకి తెచ్చారు. చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్​ఛార్జిగా ఎన్. రెడ్డప్పను తిరిగి తీసుకువచ్చారు.

వైఎస్సార్సీపీలో గొంతెత్తి ప్రశ్నిస్తే - వేటేస్తారు జాగ్రత్త సుమీ!

మైలవరం ఇన్‌ఛార్జ్‌గా తనను నియమించినందుకు గాను తిరుపతిరావు సీఎం జగన్​ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇక నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్​గా నెల్లూరు డిప్యూటీ మేయర్​ ఎండీ ఖలీల్​ను ప్రకటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అనిల్​కుమార్​ యాదవ్​తో పాటు ఖలీల్​ సీఎం క్యాంప్​ కార్యాలయానికి వచ్చారు. తనకు అవకాశం కల్పించినందుకు సీఎం జగన్​కు ధన్యవాదాలు తెలిపారు.

Last Updated : Feb 2, 2024, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.