ETV Bharat / state

మసకబారిన మున్సిపల్‌ స్టేడియం- మైదానంతో ఆటలాడుకున్న వైఎస్సార్సీపీ సర్కార్‌ - vijayawada STADIUM

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 17, 2024, 1:18 PM IST

Indira Gandhi Municipal Stadium: క్రీడాకారులు మైదానంలో ఆటలు ఆడుకుంటారు. అలాంటి మైదానంతో వైఎస్సార్సీపీ సర్కార్ ఆటలాడింది. ఎగ్జిబిషన్లు, రాజకీయ సమావేశాలకు వేదికగా మార్చేసింది. ఒకప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికైన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ క్రీడామైదానం గత ఐదేళ్లూ నిర్వహణకు దూరమైంది. చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతోంది.

Indira Gandhi Municipal Stadium
Indira Gandhi Municipal Stadium (ETV Bharat)

Indira Gandhi Municipal Stadium : గతమెంతో ఘనమన్నట్లు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో మెగా ఈవెంట్లకు ఈ మైదానం వేదికగా నిలిచింది. 2002లో భారత్- వెస్టిండీస్ వన్డే క్రికెట్ మ్యాచ్​కు ఆతిథ్యమిచ్చి పరుగులకు స్వర్గధామంగా నిలిచి వ్యాఖ్యాతలు ప్రశంసలు అందుకుందీ క్రీడామైదానం.2004, 2007, 2014 సంవత్సరాల్లో జాతీయ జూనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్​లకు 5 వేదికగా నిలిచి పలువురు అథ్లెట్లు న్యూ మీట్ రికార్డులు నమోదు చేసేందుకు ఆతిధ్యమిచ్చిన అథ్లెటిక్ క్లే ట్రాక్ ఆనవాళ్లే లేకుండా పోయింది. వాలీబాల్, నెట్ బాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ వంటి ఎన్నో జాతీయస్థాయి పోటీలు నిర్వహించారు.

YSRCP Government Negligence on Sports Grounds : ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి స్టేడియం ప్రాంగణం ఎటు చూసినా వర్షపునీటితో నిండిపోయింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికగా నిలిచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దయనీయంగా మారింది. ప్రస్తుతం చిన్నపాటి వర్షం కురిసినా తటాకాన్ని తలపిస్తోంది. మైదానంలోకి అడుగుపెట్టాలంటే నీటిలోకి దిగక తప్పడంలేదు.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్టేడియం అభివృద్ధిని పూర్తిగా విస్మరించడమే ఇందుకు కారణం. రాజకీయ సమావేశాలకు, స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వేడుకలకు ఐజీఎం స్టేడియాన్నే వినియోగిస్తున్నారు. ఇక చిన్నచిన్న ఎగ్జిబిషన్లు కూడా గతంలో ఇక్కడ నిర్వహించిన ఉదంతాలు ఉన్నాయి. ఫలితంగా ఎక్కడికక్కడే గుంతలు మైదానంలో దర్శనమిస్తున్నాయి. మైదానంలో ఇనుప మేకులు పడిపోయి క్రీడాకారులు వాకింగ్, జాగింగ్ చేసేటప్పుడు గాయపడుతున్నారు. గల్లీలో క్రికెట్ ఆడుకునే పిల్లలు అంతా ఈ మైదానంలో చేరిపోయి రాళ్లు, రప్పలు వేస్తున్నారు. ఎక్కడికక్కడే స్టంపులు పాతేసి మైదానం పాడుచేస్తున్నారు.

స్టేడియాన్ని ఆటలకే పరిమితం చేయాలి : రాత్రయితే చాలు ఈ మైదానాన్ని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అథ్లెట్లు, వాకర్లు, మిగతా క్రీడాకారులు ఇక్కడ పరుగులు తీయాలంటే ఎగుడు దిగుడు మైదానంతో నానా అగచాట్లు పడుతున్నారు. గతంలో ఇక్కడ మంజూరైన అథ్లెటిక్స్ ట్రాక్​ను వివిధ కారణాలతో వేరే జిల్లాకు తరలించారు. విజయవాడ నడిబొడ్డున పేరున్న ఈ మైదానాన్ని పూర్తిగా ఆటలకే పరిమితం చేయాలని ఎన్నోసార్లు క్రీడాసంఘాలు, ఒలింపిక్ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కొత్త ప్రభుత్వమైనా ఈ మైదానం బాగోగులు చూడాలని క్రీడాసంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

విజయవాడ ఇండోర్ క్రీడామైదానం ప్రస్తుతం నగరపాలక సంస్థ ఆధీనంలో ఉంది. వారే నిర్వహణ బాధ్యతలు చూడాల్సి ఉండగా పూర్తిగా దృష్టి పెట్టడం లేదు. క్రీడాకారులకు శిక్షణ కల్పిస్తున్న స్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ అధికారులు సైతం మైదానం అభివృద్ధికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ మైదానాన్ని పూర్తిగా క్రీడలకు పరిమితం చేస్తూ అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి పంపుతున్నామని చెబుతున్నారు క్రీడాధికారులు.

క్రీడాకారులు డిమాండ్స్ : కొత్తగా వచ్చిన ఎన్డీయే ప్రభుత్వమైనా విజయవాడ ఇండోర్ స్టేడియాన్ని పూర్తి స్థాయిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. విజయవాడ ఇండోర్ స్టేడియాన్ని కేవలం క్రీడలకే ఉపయోగించాలని, క్రీడాకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Indira Gandhi Stadium: ఇందిరాగాంధీ స్టేడియంలో మహాయాగం.. ప్రభుత్వ తీరుపై క్రీడాకారుల అసహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.