ETV Bharat / state

అడవిలా మారిన అమరావతి ప్లాట్లు - కోర్టులు, అన్నదాతలను మోసం చేస్తున్న సర్కార్ - ysrcp govt negligence on amaravati - YSRCP GOVT NEGLIGENCE ON AMARAVATI

YSRCP Government Negligence on Amaravati: మోసం అనే పునాదులపై ఏర్పడ్డ జగన్‌ సర్కారు, అమరావతి విషయంలో రైతులను, కోర్టులను తప్పుదోవపట్టిస్తోంది. రాజధాని రైతులకిచ్చిన ప్లాట్ల అభివృద్ధిని ప్రభుత్వం తుంగలో తొక్కింది. దీంతో ప్రస్తుతం ఆ స్థలాలు అడవిలా మారిపోయాయి. తమ ప్లాట్ల దుస్థితి చూసి అన్నదాతలు నైరాశ్యంలో మునిగిపోయారు.

Negligence on Amaravati Plots
Negligence on Amaravati Plots (etv bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 1:06 PM IST

YSRCP Government Negligence on Amaravati: అమరావతి విషయంలో అన్నివర్గాలనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. లబ్ధిదారులకిచ్చిన ప్లాట్లలో అయిదేళ్లకాలంలో ఎలాంటి మౌలిక వసతులనూ కల్పించలేదు. కొన్ని ప్రాంతాల్లో తూతూమంత్రంగా జంగిల్‌ క్లియరెన్స్‌ (Jungle Clearance) చేసి, తర్వాత ఆ పనులనూ ఆపేసింది. జగన్‌ సర్కారు కక్ష సాధింపు చర్యల కారణంగానే రైతుల ప్లాట్లు అడవిని తలపిస్తున్నాయి. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇక్కడ అభివృద్ధికి నిధులు వెచ్చించడం ఇష్టం లేకే నాటకాలాడుతోందని రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మూణ్నాళ్ల ముచ్చటగా పనులు: రాజధాని కోసం గత ప్రభుత్వం 34 వేల ఎకరాలను భూసమీకరణ విధానంలో రైతులనుంచి తీసుకుంది. ఇందుకుగాను రైతులకు అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను ఇవ్వాలన్నది ఒప్పందం. ఇలా కేటాయించిన మొత్తం ప్లాట్లు 64,735. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల పేర్లతో సుమారు 40 వేలకుపైగానే ప్లాట్లను రిజిస్టర్‌ చేసింది. జగన్‌ మోహన్ రెడ్డి సర్కారు వచ్చాక ఈ ప్రక్రియను నిలిపేయడంతో రైతులు హైకోర్టుకెళ్లారు. సుదీర్ఘ విచారణ అనంతరం, అన్నదాతలకు అన్ని వసతులతో ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని రెండు సంవత్సరాల క్రితం కోర్టు స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం, మిగతా ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సైతం ప్రారంభించింది. సీఆర్డీఏ 13 జోన్లలో మౌలిక వసతుల కల్పన కోసం 16 వేల 400 కోట్ల అంచనాలతో టెండర్లు పిలిచింది. 11 జోన్లకు ఖరారు చేసి గుత్తేదారులను ఎంపిక చేసింది. ప్లాట్లలో రహదారులు, డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్తు స్తంభాల ఏర్పాటు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కోసం 2022 జులై నెలలో పనులను ప్రారంభించారు. కొన్నాళ్లు కంపచెట్లు తొలగించిన అనంతరం సీఆర్డీఏ మొత్తం పనులను నిలిపేసింది.

రాజధాని అమరావతి పరిధి గ్రామాల్లో భూసేకరణ రద్దు - అంతా జగనన్న ప్లానే - Land Acquisition Withdrawal

ఎవరి ప్లాట్‌ ఎక్కడో: రైతుల ప్లాట్లలో 16 వేల 400 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వం కోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. దీనికి సాక్ష్యంగా పలు చిత్రాలను జత చేసింది. తిరిగి ఏడాదిన్నర క్రితమే సీఆర్డీఏ (Capital Region Development Authority) అధికారులు ఆ పనులను నిలిపేశారు. అప్పట్నుంచి ఈనాటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. జంగిల్‌ క్లియరెన్స్‌ చేసిన ప్రాంతంలో ముళ్లకంపలు దట్టంగా పెరిగిపోయాయి. పనుల కోసం 3 వేల 500 కోట్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తున్నట్టు చెప్పి, ఆ తరువాత మిన్నకుండిపోయింది. దీంతో బ్యాంకర్లు ముందుకు రాలేదు. విశాఖకు పరిపాలనను మార్చాలన్న తలంపుతో ఉన్న జగన్‌, అమరావతిని కావాలనే నిర్లక్ష్యం చేశారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమ్ముదామంటే కొనేవారేరీ: అవసరాల కోసం ప్లాటు అమ్ముకుందామన్నా కొనేవారు రావటం లేదు. పిల్లల చదువులు, ఆరోగ్య అవసరాలు, వివాహాల కోసం అప్పులు చేస్తూ రాజధాని అమరావతి రైతులు కాలం వెళ్లదీస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం సీఆర్డీఏ అట్టహాసంగా జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టిన తుళ్లూరు, దొండపాడు, పిచ్చికులపాలెం, అనంతవరం గ్రామాల సమీపంలో ప్రస్తుతం భారీగా ముళ్ల చెట్లు పెరిగిపోయాయి. ఆ ప్లాట్లలోకి అడుగు పెడదామన్నా వీలు కాని పరిస్థితి. కనుచూపు మేర అడవిలా విస్తరించింది. దీనికితోడు ఎవరి ప్లాట్‌ ఎక్కడుందో తెలియని పరిస్థితి. హద్దులు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. జగన్‌ ప్రభుత్వ తీరు రైతులకు శాపంలా మారింది.

'స్మార్ట్​గా అమరావతి' పీకనొక్కిన జగన్‌ సర్కార్‌ - Amaravati Smart City funds

స్థలానికి వెళ్లేందుకు దారి లేదు: రాజధాని నిర్మాణానికి 4.5 ఎకరాలిచ్చానని, గత ప్రభుత్వం లాటరీ విధానంలో నాకు ప్లాట్లు కేటాయించిందని, జగన్‌ వచ్చాక రాజధాని భూములన్నీ ముళ్లకంప చెట్లతో అడవిలా మారిపోయాయని దొండపాడుకు చెందిన రైతు చంద్రశేఖర్‌ తెలిపారు. తన ప్లాటు ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొందని, అక్కడకు వెళ్లేందుకు కనీసం దారి కూడా లేదని అన్నారు. అమ్మేద్దామనుకున్నా, కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని, ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నానని వాపోయారు.

అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తున్నా: చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతో భూసమీకరణలో తాను 3.5 ఎకరాలిచ్చానని, అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తామని చెప్పారని ఐనవోలుకు చెందిన రైతు వీరయ్య తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులంటూ అమరావతిని అటకెక్కించిందని వాపోయారు. తమ ప్లాట్లలో ఎటు చూసినా కంపచెట్లే కనిపిస్తున్నాయని అన్నారు. తనకు ఇద్దరమ్మాయిలని, వాళ్ల ఇంజినీరింగ్‌ చదువుల కోసం ప్లాటు అమ్ముదామనుకున్నా రేట్లు పడిపోయాయని, చేసేది లేక అప్పులు చేసి పిల్లలను చదివిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్​కు అమరావతిపై తగ్గని కసి - మరింత దెబ్బతీసేందుకు ప్రణాళికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.