ETV Bharat / state

ఐదేళ్లలో పరిశ్రమలకు చుక్కలు చూపిన జగన్‌ సర్కారు - బాదుళ్లు తట్టుకోలేక పరార్ - YSRCP Govt Neglected Industries - YSRCP GOVT NEGLECTED INDUSTRIES

YSRCP Government Neglected Handloom Industries: ప్రపంచంలోఏ ప్రభుత్వమైనా పరిశ్రమల్ని ప్రోత్సహిస్తుంది. ప్రజలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాయితీల కల్పించి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం దానికి రివర్స్. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రాయితీల ఆశపెట్టిన జగన్‌ గద్దెనెక్కాక రాచిరంపాన పెట్టారు. గతంలోకొన్న భూములకూ ధరలు పెంచి మళ్లీ డబ్బులు కట్టాలన్నారు. జగన్‌ బాదుడు తట్టుకోలేక పరిశ్రమలు కాస్తా పక్క రాష్ట్రాల బాటపట్టాయి.

ysrcp_govt_neglected_industries
ysrcp_govt_neglected_industries
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 3:54 PM IST

Updated : Apr 25, 2024, 4:56 PM IST

ఐదేళ్లలో పరిశ్రమలకు చుక్కలు చూపిన జగన్‌ సర్కారు - బాదుళ్లు తట్టుకోలేక పరార్

YSRCP Government Neglected Handloom Industries: పరిశ్రమల స్థాపనకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలకు తోడు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌- ఏపీఐడీసీ(APIDC)ని పునరుద్ధరించి నిరుద్యోగ యువతకు రాయితీ అందించే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏటా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తానని చెప్పి ఐదేళ్లలో రెండుసార్లే బటన్‌ నొక్కారు. 2020లో 962.42 కోట్లు, 2021లో స్పిన్నింగ్‌ మిల్లులకు 684 కోట్లు, ఎంఎస్​ఎం(MSM)లకు 440 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాతి మూడేళ్లు చెల్లించాల్సిన రెండున్నర వేలకోట్ల రాయితీలకు మంగళం పాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తామంటూ ఇచ్చిన హామీని గాలికొదిలేసి మూడోసారీ మాట తప్పారు.

భారీగా భూముల ధరలు: పరిశ్రమలకు కేటాయించే భూములపై రాయితీలు కల్పిస్తామని గత మ్యానిఫెస్టోలో జగన్‌ హామీ ఇచ్చారు. కానీ రాయితీపై కొత్తగా భూములివ్వడం దేవుడెరుగు పారిశ్రామికపార్కుల్లో స్థలాల ధరలు అమాంతం పెంచారు. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం పారిశ్రామిక పార్కులో పరిశ్రమలకు గత తెలుగుదేశం ప్రభుత్వం ఎకరా 8 లక్షల రూపాయలకు కేటాయించింది. అదే స్థలాన్ని వైసీపీ సర్కార్‌ ఇప్పుడు 88 లక్షలకు పెంచేంసింది. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో గత ప్రభుత్వం ఎకరా 16న్నర లక్షల లెక్కన కేటాయిస్తే జగన్‌ సర్కార్‌ ఎకరా ధర 80 లక్షలకు పెంచింది. గతంలో భూములు పొందిన పారిశ్రామికవేత్తలూ కొత్త ఛార్జీలకు అనుగుణంగా డబ్బు చెల్లించాలంటూ నోటీసులు పంపింది. చేసేదేమీలేక చాలా మంది పెట్టుబడుల ప్రతిపాదన విరమించుకుని తెలంగాణకు వెళ్లిపోయారు.

రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచిన వైసీపీ- దేశం అస్తిత్వానికే ముప్పు ఏర్పడే పరిస్థితి - Drugs Usuage in ap

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని అత్తివరం పారిశ్రామిక పార్కులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ గత ప్రభుత్వం ఎకరా 14 లక్షల చొప్పున ఇస్తే జగన్‌ సర్కారు రాగానే ఆ మొత్తాన్ని 58లక్షల 68 వేల రూపాయలకు పెంచింది. పరిశ్రమలకు అవుట్‌ రైట్‌ సేల్స్‌-ఓఆర్​ఎస్​ కింద భూములను కేటాయించే నిబంధనకు వైసీపీ సర్కారు మూర్పులు చేసింది. ముందుగా లీజు విధానంలో కేటాయించి 10ఏళ్ల నిర్వహణ తర్వాత రిజిస్ట్రేషన్‌ చేసేలా 'లీజు కం బై' విధానాన్ని తెచ్చింది. ఈ విధానంలో పారిశ్రామికవేత్తలకు ఖర్చు మిగులుతుందని ప్రభుత్వం చెప్పింది. దీనిపై వ్యతిరేకత రావడంతో గతేడాది నవంబరులో మళ్లీ ఓఆర్​ఎస్ పద్ధతినే అమలు చేస్తున్నట్లు సవరణ ఉత్తర్వులిచ్చింది. భూముల ధరలను ప్రభుత్వం భారీగా పెంచడంతో ఏపీఐఐసీ(APIIC) పారిశ్రామికపార్కుల్లో భూములు తీసుకునేవారు లేక 44 వేల 767 ఎకరాలు మిగిలిపోయాయి.

రాయతీల్లో కోత: పన్నుల్లో రాయితీ ఇస్తామని చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాకా ఫీజుల వాత పెట్టారు. గతంలో భవనాల వరకే పన్ను లెక్కించే విధానానికి బదులు పూర్తి విస్తీర్ణానికి పన్ను లెక్కించే విధానం తెచ్చారు. అదీ చాలదన్నట్లు ఏటా 5 శాతం పన్ను పెంపు వర్తించేలా నిబంధన విధించారు. దీనివల్ల ఒక మోస్తరు పరిశ్రమపై ఏటా 30 వేలకుపైగా అదనపు భారం పడింది. వార్షిక లైసెన్సు ఫీజులనూ వైసీపీ సర్కార్‌ 2023లో భారీగా పెంచేసింది. ఉత్తర్వులిచ్చిన తేదీ నుంచి కాకుండా 2019 నుంచి లెక్కగట్టి మరీ రెట్రాస్పెక్టివ్‌ వసూలు చేసింది. కాలుష్య నియంత్రణ మండలి లైసెన్సు కోసం 2019లో మూడేళ్లకు 90 వేల చొప్పున చెల్లించే మొత్తాన్ని ఏకంగా 4 లక్షల రూపాయలకు పెంచింది. అగ్నిమాపకశాఖ ఇచ్చే కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ అనుమతికి ఏడాదికి లక్ష రూపాయలుగా ఉన్న ఫీజును 8 లక్షలకు పెంచింది.

మమ్మల్నే అడ్డుకుంటారా? పోలీసులపై విరుచుకుపడ్డ మంత్రి అమర్​నాథ్ - Minister Amarnath Fire on Police

బాదుడే బాదుడు: విద్యుత్‌ ఛార్జీల రాయితీ ఇస్తామని చెప్పిన జగన్‌ సర్కార్‌ అదనంగా వాయించేసింది. పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్‌ వినియోగదారుల నుంచి యూనిట్‌కు 6 పైసల చొప్పున వసూలు చేసే విద్యుత్‌ సుంకాన్ని రూపాయికి పెంచుతూ 2022 ఏప్రిల్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. దీని వల్ల ఏటా 2వేల 600 కోట్ల అదనపు భారం పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై పడింది.

  • 2014-19 మధ్య గడచిన కాలానికి ట్రూఅప్‌ ఛార్జీల పేరిట యూనిట్‌కు 22 పైసల చొప్పున అదనంగా బాదింది.
  • 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద యూనిట్‌కు 63 పైసల చొప్పున వసూలు చేసింది.
  • 2023-24లో వినియోగించిన విద్యుత్‌కు యూనిట్‌కు 40 పైసల చొప్పున వసూలు చేసింది.

తోడబుట్టిన చెల్లెలి పుట్టుక, కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా?: చంద్రబాబు - Chandrababu and Lokesh on CM Jagan

జగన్ మార్క్‌ మోసం: యూనిట్‌కు రూపాయి 10 పైసల చొప్పున వసూలుకు అనుమతించాలని ఏపీఈఆర్​సీ(APERC)ని డిస్కంలు కోరాయి. ఈ ప్రకారం మరో 70 పైసల భారం పడే అవకాశం లేకపోలేదు. టారిఫ్‌ ప్రకారం యూనిట్‌కు 5 రూపాయల 85 పైసలు వసూలు చేస్తుండగా జగన్ మార్క్‌ అదనపు షాక్‌లన్నీ కలిపితే మొత్తం యానిట్ ధర 8 రూపాయల 10పైసల వరకూ అవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీల ప్రకారం యూనిట్‌కు రూపాయిన్నర చొప్పున ఇవ్వాల్సిన విద్యుత్‌ రాయితీలనూ ఐదేళ్లలో చెల్లించిన పాపాన పోలేదు.

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ-ఏపీఐడీసీ పునరుద్ధరణ జగన్ ముఠా కోసం తప్ప నిరుద్యోగుల కోసం కాదని తేలిపోయింది. విజయవాడ నగర డిప్యూటి మేయర్‌ పదవిని ఇవ్వలేకపోయిన కార్పొరేటర్‌ను ఆ సంస్థకు ఛైర్మన్‌గా, మరో 11 మందికి డైరెక్టర్లుగా రాజకీయ ఉపాధి కల్పించారు. కనీసం సంస్థ కార్యకలాపాలు తెలుసుకుందామంటే ఆ సంస్థ పేరిట ఉన్న వెబ్‌సైట్‌ కూడా పనిచేయడం లేదు. పారిశ్రామికాభివృద్ధి పట్ల జగన్‌ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం.

Last Updated : Apr 25, 2024, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.