ETV Bharat / state

కార్యాలయం లేదు, ఉద్యోగులూ లేరు- కమిషనర్​ రాజీనామాతో 12వ పీఆర్సీ కథ ముగిసింది! - jagan Cheating Govt Employeees - JAGAN CHEATING GOVT EMPLOYEEES

YSRCP Government Cheating Employees in PRC Issue: ఉద్యోగులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసింది. వైఎస్సార్సీపీ జమానాలో వేసిన 12వ వేతన సవరణ సంఘం కథ అసలు పని ప్రారంభించకుండానే ముగిసింది. కనీసం సిబ్బందినీ కేటాయించకపోవడంతో సిఫార్సులేవీ చేయలేకపోతున్నట్లు కమిషనర్‌గా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్‌ రాజీనామా చేశారు.

YSRCP Government Cheating Employees in PRC Issue
YSRCP Government Cheating Employees in PRC Issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 7:50 AM IST

Updated : Jun 19, 2024, 8:07 AM IST

YSRCP Government Cheating Employees in PRC Issue : ఉద్యోగుల పీఆర్సీ విషయంలో గత ప్రభుత్వం చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలాంటి సిఫార్సు చేయకుండానే అసలు ఉద్యోగుల నుంచి ఒక్క విజ్ఞాపన పత్రాన్ని తీసుకోకుండానే 12వ పీఆర్సీ కథ ముగిసిపోయింది. ఈ నెల 14 తేదీన పీఆర్సీ కమిషనర్, విశ్రాంత ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ఆ పదవి నుంచి తప్పుకొన్నారు. తనను రిలీవ్ చేయాల్సిందిగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్​కు లేఖ రాశారు.

Jagan Cheating Employeees : 2023 జూలై లో తనను 12వ పీఆర్సీ కమిషనర్​గా తనను జగన్ ప్రభుత్వం నియమించినప్పటికీ ఉద్యోగులను, సిబ్బందినీ కేటాయించక పోవటంతో ఎలాంటి సిఫార్సులూ చేయలేక పోయనట్టు పేర్కోన్నారు. తక్షణం 132వ పీఆర్సీ కమిషనర్​గా తనను రిలీవ్ చేయాలని కోరుతూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్​కు లేఖ రాశారు. పీఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ లేఖతో జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను నిట్టనిలువునా మోసం చేసినట్టు తేటతెల్లం అవుతోంది. ఉద్యోగుల తీవ్ర ఆందోళనల మధ్య 2022లో రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం మేర రివర్సు పీఆర్సీని ప్రకటించింది. తదుపరి వేతన సవరణ సంఘాన్ని వేస్తున్నట్టు ప్రకటించినా ప్రస్తుతం 12వ పీఆర్సీ కమిషనర్ ఏడాది కాలంగా ఏ సిఫార్సూ చేయలేకపోయానని పేర్కోంటూ లేఖ రాయటంతో జగన్ సర్కారు చేసిన మోసం బట్టబయలైంది.

ఉద్యోగుల జీపీఎస్​ సొమ్మును ప్రభుత్వం కాజేసింది : సూర్య నారాయణ - KR Suryanarayana

Government Employees PRC Issue : అసలు 12వ పీఆర్సీకి కనీస మౌలిక సదుపాయాలైన ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయలేపోవటంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. పీఆర్సీ కమిషనర్​కు కుర్చీ కూడా లేదంటూ ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో జగన్ ప్రభుత్వంపై ఆక్షేపణ వ్యక్తం చేశాయి. ఉద్యోగులు లేకపోవటంతో అసలు పని కూడా ప్రారంభించలేక పోయినట్టుగా పీఆర్సీ కమిషనర్ పేర్కోనటం జగన్ ప్రభుత్వ తీరుకు ప్రత్యక్ష నిదర్శనగా నిలుస్తోంది.

చెప్పిందేంటీ చేసిందేంటీ జగనన్నా? నాలుగేళ్లుగా నానావస్థలు- విజయవాడలో రోడ్డెక్కిన ఔట్​ సోర్సింగ్ ఉద్యోగులు

వాస్తవానికి 11 పీఆర్సీ అమలు కోసం 2022లో ఉద్యోగ సంఘాన్నీ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి. దీంతో దిగొచ్చిన అప్పటి జగన్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలపై చర్చలు జరిపి రివర్సు పీఆర్సీ ప్రకటించింది. గతంలో ఇచ్చిన 27 శాతం మధ్యంతర భృతిని కాదని 23 శాతానికి పీఆర్సీ పెంపుదలను పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇది రివర్సు పీఆర్సీ అంటూ జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కారణంగానే ఉద్యోగులంతా ఇటీవలి ఎన్నికల్లో జగన్‌ పార్టీకి బుద్ధి చెప్పారని గుర్తు చేస్తున్నారు.

AP Govt Employees Protest Issue: చెప్పిందేంటి.. చేసిందేంటి జగన్​ సారూ..?నాలుగేళ్లుగా నానావస్థలు..

Last Updated : Jun 19, 2024, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.