ETV Bharat / state

చంద్రబాబు రోడ్‌ షోలో వైఎస్సార్సీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు - ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు - YCP ACTIVISTS PROVOKING ACTIVITIES

YSRCP Activists Provoking Activities: చంద్రబాబు పర్యటనలో వైఎస్సార్సీపీ శ్రేణుల కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. చంద్రబాబు రోడ్‌ షో కోసం చంద్రమౌళి నగర్‌ పోస్టాఫీసు వద్దకు టీడీపీ కార్యకర్తలు చేరుకోగా, అ సమీపంలోనే మంత్రి విడదల రజిని కార్యాలయం ఉంది. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా జెండాలూపుతూ వైఎస్సార్సీపీ శ్రేణుల కవ్వింపు చర్యలకు దిగారు. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.

YSRCP_Activists_Provoking_Activities
YSRCP_Activists_Provoking_Activities
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 12:20 PM IST

చంద్రబాబు రోడ్‌ షోలో వైఎస్సార్సీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు - ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు

YSRCP Activists Provoking Activities: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు పర్యటనలో వైఎస్సార్సీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు తెగబడ్డాయి. చంద్రబాబు రోడ్ షో కోసం చంద్రమౌళి నగర్ పోస్టాఫీసు వద్దకు తెలుగుదేశం కార్యకర్తలు భారీసంఖ్యలో చేరుకున్నారు. అక్కడికి సమీపంలోనే మంత్రి విడదల రజిని కార్యాలయం ఉంది. అయితే తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టేలా వైఎస్సార్సీపీ శ్రేణులు జెండాలు ఊపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. దీనికి ప్రతిగా టీడీపీ కార్యకర్తలు జెండాలు ఊపుతూ నినాదాలు చేస్తూ అరుపులు, కేకలతో మంత్రి కార్యాలయం వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షకపాత్ర వహించారు.

రోడ్‌షోలో అపశ్రుతి జరగడం భావ్యం కాదని భావించిన టీడీపీ నేతలు కార్యకర్తలను సముదాయించి అక్కడి నుంచి రోడ్డు అవతలికి పంపారు. అప్పుడు పోలీసులు తెలుగుదేశం నాయకులను అడ్డుకున్నారు. కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా వైఎస్సార్సీపీ వాళ్లను లోపలికి పంపితేనే వెళతామని పట్టుబట్టారు. ఎట్టకేలకు రంగంలోకి దిగిన పోలీసులు హడావుడిగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను కార్యాలయం లోపలికి పంపారు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు ముందుకు కదిలారు. చంద్రబాబు రోడ్‌షో మార్గంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించకుండా వదిలేసి పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు. దీంతో రోడ్‌షో ఆలస్యంగా సాగింది.

రెచ్చిపోయిన వైసీపీ మూకలు - తాడిపత్రి ఆర్వో కార్యాలయంలో ఉద్రిక్తత - andhra pradesh elections 2024

వైసీపీ శ్రేణులు ఈ విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడటం నిత్యం జరుగుతూనే ఉంది. తాజాగా ఉయ్యూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ ప్రచారం నిర్వహిస్తుండగా మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఉయ్యూరు కూడలిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు బోడే ప్రసాద్ కాన్వాయ్ రావటంతో, అక్కడే ఉన్న రాజీవ్ పెద్ద ఎత్తున కార్యకర్తలను మోహరించాడు. సౌండ్‌ బాక్సుల్లో పెద్దగా జగన్‌ పాటలు వేశాడు.

అనుచరులు కొందరు రోడ్డుకు రెండు వైపులా నిలబడి వైఎస్సార్సీపీ జెండాలు పట్టుకొని ‘జై జగన్‌’ అంటూ నినాదాలు చేస్తుండగా, ఇంకొందరు వాహనాల ర్యాలీ మధ్యలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల అరుపులు, కేకలతో జెండాలను ఊపుతూ టీడీపీ నేతలను రెచ్చగొట్టారు.

అయినా సంయమనం పాటించి కూటమి శ్రేణులు వెళ్తుంటే, ర్యాలీ చివర్లో కారును రోడ్డుపైనే ఆపిన రాజీవ్‌ డోర్‌ తీసి దానిపై నిలబడి కూటమి శ్రేణులను రెచ్చగొట్టేలా మీసాలు మెలేశాడు. వైఎస్సార్సీపీ జెండా ఊపుతూ తొడగొట్టి, దమ్ముంటే చూసుకుందాం రండి అంటూ సవాలు విసిరాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ నేతలను మాత్రమే వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. వైసీపీ నేతలకు మాత్రం ఏ విధమైన హెచ్చరికలు ఇవ్వలేదు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు.

అనకాపల్లిలో ఉద్రిక్తత - టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకుల కవ్వింపు చర్యలు - NDA Alliance Candidates Nomination

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.