YS Sharmila Warning To YS Jagan: వ్యవసాయానికి ఆదరణ లేక వైసీపీ పాలనలో రైతులు అప్పుల పాలయ్యారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యాయయాత్ర నిర్వహించిన షర్మిల రెండో రోజు చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో పర్యటించారు. బహిరంగ సభలో వెకాపా ఐదు సంవత్సరాల పాలన పె తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
రైతులకు పంట నష్ట పరిహారం, గిట్టుబాటు ధర లేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా ప్రజా సమస్యలు పరిష్కరించలేని నేత నారాయణస్వామి అన్నారు. అంబేద్కర్ వారసుడిగా చెప్పుకుంటూ కల్తీ మద్యం అమ్ముతారా అని ప్రశ్నించారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏడు సార్లు విద్యుత్ చార్జీలు, ఐదు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే రాష్ట్రంలో మూతపడిన చెక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ సుపరిపాలన కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.
కుంభకర్ణుడైనా ఆరు నెలలకు ఒకసారి నిద్ర లేస్తాడు గానీ జగన్ మాత్రం నాలుగున్నర సంవత్సరాల తర్వాత నిద్రలేచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికీ 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఎన్నికలప్పుడు 6 వేల ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. 25 వేల టీచర్ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు జగన్? అంటూ ప్రశ్నించారు. ఒక్క బిడ్డకే అమ్మఒడి ఇస్తే.. రెండో బిడ్డను ఎలా చదివించాలని నిలదీశారు.
జగన్ పాలనలో రాష్ట్రం హత్య రాజకీయాల రాజ్యంగా మారిందని వైఎస్ షర్మిలా ఆరోపించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో చేపట్టిన న్యాయ యాత్ర బహిరంగసభలో ఆమె పాల్గొన్న ఆమె సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో ఎక్కడ చూసినా మద్యం, మైనింగ్, ఇసుక మాఫియా రాజ్యమేలుతోందన్నారు. పలమనేరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాఫీయా పాలన సాగించారని ఆరోపించారు. నియోజకవర్గంలోని నదుల్లో మొత్తం ఇసుకే లేకుండా మాయం చేశారని విమర్శించారు.
మళ్ళీ ఆయనకు ఓటేస్తే పలమనేరు ప్రజలను అమ్మెస్తారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కౌటిల్య నదిలో మొత్తం ఇసుక దోచేశారని ఆరోపించారు. ఆ ప్రాజెక్ట్ లో ఇసుక తవ్వేసరికి నీటి కొరత ఏర్పడి త్రాగడానికి గుక్కెడు నీళ్ళు లేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి నాయకుడిని నమ్ముకుంటే ఇసుక అమ్మెశారని, మళ్ళీ గెలిస్తే భూములను అమ్మెస్తారన్నారు. జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పట్టు పరిశ్రమను దివాలా తీయించాడని, పట్టు రైతులకు రాయితీలు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. జగన్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు.
కొంగుచాచిన తోబుట్టువులకు ఏం చెప్తావ్ జగన్? - Sisters fire on CM Jagan