ETV Bharat / state

వైఎస్సార్​సీపీలో YSR అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణా రెడ్డి : షర్మిల వ్యంగ్యాస్త్రాలు - వైవి సుబ్బారెడ్డి

YS Sharmila Fires on CM Jagan: వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అంటే గతంలో ఉన్న అర్థం వేరని, ఇప్పుడున్న అర్థం వేరంటూ ఓ కొత్త నిర్వచనాన్ని ఏపీ పీసీపీ అధ్యక్షురాలు షర్మిల ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్​ రెడ్డి ఆశయాలు వేరని, ఇప్పుడు పార్టీ ఆచారిస్తున్న విధానాలు వేరని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ys_sharmila_fires_on_cm_jagan
ys_sharmila_fires_on_cm_jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 4:10 PM IST

YS Sharmila Fires on CM Jagan: అధికార వైఎస్సార్​సీపీపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల విమర్శల పర్వం కొనసాగుతోంది. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి వివిద జిల్లాలో పర్యటనలు చేస్తున్న ఆమె, తాజాగా ప్రకాశం జిల్లాలో కార్యకర్తల సమావేశంలో వైఎస్సార్​సీపీ​ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్సార్‌సీపీ పార్టీకి షర్మిల కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఆ పార్టీ పేరుకు గతంలో ఉన్న అర్థం వేరని, ఇప్పుడున్న అర్థం వేరంటూ విమర్శించారు. ఇప్పుడున్న వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి లేరని, వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్​ అంటే సాయిరెడ్డి, ఆర్​ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమేనని ఆమె అభివర్ణించారు.

ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో విష్ణుప్రియ ఫంక్షన్‌ హాలులో కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్​ షర్మిల పాల్గొనగా, సీనియర్‌ నాయకులు రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజుతో పాటు పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. పులి కడుపునా పులే పుడుతుందని, తనలో ప్రవహిస్తోంది వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి రక్తమని షర్మిల అన్నారు. రాజశేఖర్​ రెడ్డి కుమార్తెగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఎవరూ ఏం చేయలేరని ఆమె తేల్చి చెప్పారు.

ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతుంటే మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారు: షర్మిల

ప్రజలను పట్టించుకోని పార్టీ వైఎస్సార్​సీపీ: రాజశేఖరరెడ్డి ఆశయాలకు తిలోదకాలిస్తూ వైఎస్సార్​సీపీ పార్టీ పాలనను కొనసాగిస్తోందని విమర్శించారు. మతతత్వ పార్టీ బీజేపీని రాజశేఖర రెడ్డి వ్యతిరేకించారని, అలాంటి పార్టీతో వైఎస్సార్​సీపీ అంటకాగుతోందని షర్మిల అన్నారు. జగన్‌ రెడ్డి పార్టీ నియంత పార్టీ అని, ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేని పార్టీ అని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను తాకట్టుపెడుతోందని, స్టీల్‌ ప్లాంట్‌ పోతున్నా, పోలవరం నిర్వీర్యమైనా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"వై అంటే వై.వి.సుబ్బారెడ్డి, ఎస్‌ అంటే సాయిరెడ్డి, ఆర్‌ అంటే రామకృష్ణారెడ్డి. వైఎస్సార్​సీపీ పాలనలో ప్రకాశం జిల్లాకు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా. రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయం పండగైంది. వైఎస్సార్​సీపీ పాలనలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి వచ్చింది." - షర్మిల, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు

అభివృద్ధిని పట్టించుకోని జగన్​ను ఓడించాలి: షర్మిల

రాష్ట్రంలో ప్రాజెక్టులు నీర్వీర్యం చేశారని గుండ్ల కమ్మ ప్రాజెక్టు నిర్వహణకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా విదల్చలేదని మండిపడ్డారు. రాజశేఖరరెడ్డి జలయఙ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టులు మీద దృష్టి పెట్టారని, ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. తన మీద ముప్పేట దాడి చేస్తున్నారని, వైఎస్సార్​సీపీని తన పార్టీగా భావించి గతంలో భుజస్కందాలపై మోసినట్లు తెలిపారు.

వైఎస్సార్​సీపీ పార్టీ కోసం 3 వేల 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినట్లు గుర్తు చేశారు. అప్పుడు మనసుపెట్టి పనిచేస్తే ఇప్పుడు దాడికి దిగుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నాగులున్నరేళ్ళలో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. ఎన్నికల సీజన్‌ కాబట్టి ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్త ఓ సైన్యంలా పనిచేయాలని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని కార్యకర్తలకు సూచించారు.

జగన్​ ఘోరాలను షర్మిలే ప్రజలకు వివరిస్తోంది: సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి

వైఎస్సార్​సీపీలో YSR అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణా రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.