Adani Bribe to YS Jagan : సెకితో చేసుకున్న విద్యుత్ ఒప్పందం జగన్ నిర్వాకంతో ఏపీకి గుదిబండలా మారింది. రాజస్థాన్‌లోని అదానీ ప్లాంట్ల నుంచి సౌరవిద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం పీఎస్‌ఏలు చేసుకుంది. ఫలితంగా రాజస్థాన్ భారీగా లాభపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర నష్టం జరుగుతోంది. పన్నులు, ప్రోత్సాహకాలతో కలిపి రాజస్థాన్‌కు రూ.11,000ల కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. పైగా 14,000ల మందికి ఉపాధి పాతికేళ్లలో రూ.8000ల కోట్ల లబ్ధితో పాటు 30 ఏళ్లపాటు ప్లాంట్ల ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతులకు ఆదాయం సమకూరనుంది. జగన్ స్వార్థంతో వీటన్నిటిని ఆంధ్రప్రదేశ్ కోల్పోతోంది.
రాష్ట్ర అవసరాల కోసం సౌర విద్యుత్ ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేయడం కోసం 2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం సర్కార్, కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకినే రాష్ట్రానికి రప్పించి ఏపీజెన్‌కో, నరెడ్‌క్యాప్‌లతో కలసి జాయింట్ వెంచర్ కంపెనీ నెలకొల్పింది. దాని ఆధ్వర్యంలో ఏపీలో సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు చొరవ తీసుకుంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో 4000ల మెగావాట్ల సామర్థ్యంగల నాలుగు సోలార్ పవర్ పార్కులు అభివృద్ధి చేసింది. వాటిలో 2019 నాటికే 3050 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమైంది.
ఈ ప్లాంట్ల వల్ల వచ్చే ట్యాక్స్‌లు, ఉపాధి, అన్నదాతలకు ఆదాయం వంటి ప్రయోజనాలన్నీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు దక్కుతున్నాయి. అదే జగన్ హయాంలో ఎక్కడో రాజస్థాన్‌లో అదానీ సంస్థ ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ల నుంచి అధిక ధరకు 7000ల మెగావాట్ల విద్యుత్ కొనేందుకు సెకితో ఒప్పందం చేసుకున్నారు. అదీ కూడా 2024లో ఉత్పత్తి ప్రారంభమయ్యే ప్లాంట్లతో 2021లోనే ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్లాంట్ల వల్ల వచ్చే లాభాలన్నీ అదానీ సంస్థకు దక్కుతాయి. అదేవిధంగా పన్నుల రూపంలో సమకూరే ఆదాయం రాజస్థాన్ ప్రభుత్వానికి దక్కుతుంది.
సెకి ఒప్పందంపై అభ్యంతరాలన్నీ తూచ్ - జగన్ అవినీతికి ఇవే సాక్ష్యాలు!
YSRCP Govt SECI Deal : అధిక ధర, ప్రసార నష్టాలు, ఇతర రూపాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మోయలేని భారం పడుతుంది. అదానీ నుంచి విద్యుత్ కొనేందుకు ఒప్పందం చేసుకోవడానికి జగన్‌కు భారీగా ముడుపులు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. మొత్తంగా రెండు ఒప్పందాల్లో ఒక ప్రభుత్వ దూరదృష్టి, మరో ఒక వ్యక్తి స్వార్థం వెల్లడయ్యాయి.
7000ల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏపీలోనే ఏర్పాటైతే మనకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మెగావాట్‌కు రూ.42 లక్షల చొప్పున డెవలపర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఛార్జీలు చెల్లిస్తారు. అలా ఆంధ్రప్రదేశ్‌కి రూ.2940 కోట్ల ఆదాయం వస్తుంది. మరోవైపు డెవలపర్ కట్టే జీఎస్టీలో 6 శాతం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తుంది. కేంద్రానికి వెళ్లే 6 శాతంలో రాష్ట్ర వాటాగా వచ్చేది కూడా కలిపితే అది 7 శాతంగా ఉంటుంది. అంటే సుమారు రూ.1960 కోట్లు వస్తుంది.
కేంద్రం రాష్ట్రంలో సోలార్ పార్కుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి మెగావాట్‌కు రూ.20 లక్షల చొప్పున గ్రాంట్‌గా ఇస్తుంది. ఈ లెక్కన రూ.1400 కోట్లు వస్తుంది. మరో రూ.1400 కోట్ల అంతర్రాష్ట్ర ప్రసార నష్టాల భారం ఉండదు. రూ.3500 కోట్ల ఛేంజ్ ఆఫ్ లా కింద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వంటి భారాలు పడవు. అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాల్లో బీడు భూములకు ఎకరానికి ఏటా రూ.30,00ల చొప్పున లభిస్తుంది. రైతు పొలంలో కాలు పెట్టాల్సిన అవసరం లేకుండా, పెట్టుబడి లేకుండా రెండేళ్లకు 5 శాతం చొప్పున పెరుగుతూ, 30 ఏళ్లపాటు ఆదాయం వస్తుంది. ప్రతి మెగావాట్‌కు ఇద్దరికి చొప్పున ఏడు వేల మెగావాట్లకు 14,000ల మందికి మందికి ఉపాధి లభిస్తుంది.
సెకితో ఒప్పందం - అవినీతికి రోల్‌మోడల్ కాదా జగన్?
Adani Bribery Case Updates : రాజస్థాన్‌లోని అదానీ ప్లాంట్ల నుంచి 7000ల మెగావాట్లు కొంటే రాష్ట్రానికి వచ్చే నష్టాన్ని పరిశీలిస్తే అది అపారమనే చెప్పాలి. మార్కెట్‌లో యూనిట్ విద్యుత్ రూ.1.99కి వస్తుంది. అలాంటప్పుడు అదానీ నుంచి సెకి ద్వారా రూ.2.49కి కొనడం వల్ల ప్రతి యూనిట్‌పై పడే అదనపు భారం 50 పైసలు. తద్వారా ఏటా 1700 కోట్ల యూనిట్ల విద్యుత్‌పై రూ.850 కోట్ల చొప్పున, 25 సంవత్సరాల్లో పడే అదనపు భారం రూ.21,250 కోట్లు. జగన్ ప్రభుత్వం 2021 డిసెంబర్లో సెకితో ఒప్పందం చేసుకోకుండా, ఏపీలోనే ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిస్తే తక్కువ ధరకే విద్యుత్ సరఫరాకు పలు సంస్థలు పోటీ పడే పరిస్థితి వచ్చే అవకాశం ఉండేది.
గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అదే సమయంలో యూనిట్‌కు రూ.1.99కే టెండర్లు ఖరారు చేశారు. ఒక్కో మెగావాట్‌కు రూ.42 లక్షల చొప్పున 7000ల మెగావాట్లకు డెవలపర్లు చెల్లించే రూ.2940 కోట్లు ఏపీ ప్రభుత్వం కోల్పోతుంది. బదులుగా రాజస్థాన్ లాభపడుతుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు మెగావాట్‌కు సుమారు రూ.4 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ మొత్తంపై రాష్ట్రానికి 7 శాతం వరకు జీఎస్టీ వస్తుంది. అంటే ఇక్కడ ప్రాజెక్టులు ఏర్పాటు చేయకపోవడం వల్ల మెగావాట్‌కు రూ.28 లక్షల చొప్పున మొత్తం రూ.1960 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది.
'బ్రేకింగ్ ది సైలెన్స్' - 2030 నాటికి దాని అంతమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
35 వేల కోట్ల అదనపు భారం : కేంద్ర ప్రభుత్వం సోలార్ పార్క్‌లలో మౌలిక వసతుల అభివృద్ధికి మెగావాట్‌కు రూ.20 లక్షలు గ్రాంటుగా ఇస్తుంది. 7000ల మెగావాట్ల ప్లాంట్లు ఏపీలో ఏర్పాటైతే రూ.1400 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్‌గా వచ్చేది. బయటి రాష్ట్రాల నుంచి కరెంట్ తీసుకోవడం వల్ల అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా నష్టాలు 3 శాతం మనమే భరించాలి. అది మెగావాట్‌కు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా. 7000ల మెగావాట్లకు ఏడాదికి రూ.1400 కోట్లు అవుతుంది. పాతికేళ్లలో రూ.35,000ల కోట్ల అదనపు భారం పడుతుంది.
మరోవైపు ఛేంజ్ ఆఫ్ లా నిబంధన కింద సోలార్ ప్యానళ్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ - బీసీడీ 40 శాతం విద్యుత్ కొనుగోలుదారే భరించాలి. దీనికి మెగావాట్‌కు సుమారు రూ.50 లక్షల చొప్పున రాష్ట్రంపై రూ.3500 కోట్లు భారం పడనుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ఖర్చులో నిర్మాణానికి 30 శాతం అదేవిధంగా మెటీరియల్‌కి 70 శాతం వెచ్చించాలి. ఈ క్రమంలో వాటిపై చెల్లించాల్సిన జీఎస్టీ నిబంధనలు మార్చడంతో గతంతో పోలిస్తే 5 శాతం పెరుగుతుంది. అది కూడా విద్యుత్ కొనుక్కునే రాష్ట్రాలపైనే పడుతుంది. ఆ భారం మెగావాట్‌కి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.1400 కోట్లు.
డేట్ మారింది- ఒకరోజు ముందే ఏపీ కేబినెట్ సమావేశం
రైతులకు తీవ్ర అన్యాయం : 7000ల మెగావాట్ల ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఏర్పాటుచేయకుండా, రాజస్థాన్ నెలకొల్పిన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనడం వల్ల ఏపీలోని అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాల్లో, సాగునీటి సదుపాయం లేక ఎప్పటి నుంచో పొలాల్ని బీడుపెట్టిన అన్నదాతలకు మరింత అన్యాయం జరుగుతుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు తీసుకున్న భూములకు ఎకరానికి రూ.30,000ల చొప్పున లీజు చెల్లిస్తారు. రెండేళ్లకోసారి 5శాతం పెంచుతారు. ఒక్కో ప్రాజెక్టు జీవితకాలం 30 సంవత్సరాలు అనుకుంటే లీజు రూపంలో ఒక్కో రైతుకు రూ.12.94 లక్షల వరకు లభిస్తుంది.
నీటి వనరులు సమృద్ధిగా ఉండి, వాణిజ్య పంటలు పండించే రైతులకు వచ్చేంత ఆదాయం కరవు సీమలోని కర్షకులకూ దక్కుతుంది. మెగావాట్‌కు 5 ఎకరాల చొప్పున 7000ల మెగావాట్లకు 35,000ల ఎకరాలు కావాలి. అంటే అన్నదాతలకు లీజు రూపంలో సుమారు రూ.4531.54 కోట్లు వచ్చేవి. ఆ డబ్బును కర్షకులు మన రాష్ట్రంలోనే ఖర్చు చేస్తారు కాబట్టి దానిపై పన్నుల రూపంలో ప్రభుత్వానికి మళ్లీ ఆదాయం వచ్చేది. జగన్ సర్కార్ నిర్వాకం వల్ల అన్నదాతలు గొప్ప అవకాశాల్ని కోల్పోయారు.
కొత్త పరిశ్రమలు తేకపోగా, ఉన్న పరిశ్రమల్నే బెదిరించి తరిమికొట్టి, వేల మంది ఉపాధికి గండికొట్టిన జగన్ సర్కార్ సౌర విద్యుత్ ప్రాజెక్టుల విషయంలోనూ అదే నిర్వాకం వెలగబెట్టింది. సౌర విద్యుత్ ప్రాజెక్టుల్లో ఒక మెగావాట్‌కు సగటున ఇద్దరికి ఉపాధి లభించనుంది. ఇలా ఏడు వేల మెగావాట్ల ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే 14,000ల మందికి ఉపాధి లభించేది. ఒక్కొక్కరికి నెలకు సగటున రూ.20,000ల జీతం అనుకున్నా ఏటా రూ.336 కోట్ల చొప్పున, 25 ఏళ్లలో జీతాల రూపంలో రూ.8400 కోట్లు వచ్చేది. ఆ డబ్బు ఇక్కడే ఉపయోగిస్తారు కాబట్టి పన్నుల రూపంలో సర్కార్‌కి మరింత ఆదాయం వస్తుంది. ఈ అవకాశాలన్నింటిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వదిలేసుకుంది.
బెదిరించి అరబిందోకు వాటా రాయించుకున్నారు- తరువాతే రూ.45 వేల కోట్ల బియ్యం ఎగుమతి
ప్రతి పథకంపై ప్రజాభిప్రాయం తప్పనిసరన్న సీఎం- ప్రభుత్వంలో కీలకం కానున్న ఐవీఆర్ఎస్