ETV Bharat / state

సరదాగా మొదలుపెడితే అంతే సంగతి - బానిసలుగా మారుతున్న యువత - YOUTH ADDICTED TO GANJA

సరదాగా అలవాటు చేసుకుని అతితక్కువ సమయంలోనే గంజాయికి బానిసలుగా మారుతున్న యువత

GANJA_CASES
YOUTH ADDICTED TO GANJA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2024, 1:53 PM IST

YOUTH ADDICTED TO GANJA: గంజాయి లభ్యత, విక్రయాలు, వినియోగం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. బహిరంగ మార్కెట్​లో లభించే సామాన్య మత్తుపదార్థంగా గంజాయి మారిపోయింది. కొన్నిచోట్ల శివారు ప్రాంతాలు, మరికొన్ని చోట్ల ఇళ్లు, దుకాణాలు సైతం గంజాయి హాట్‌స్పాట్లుగా మారాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నిత్యం 10 నుంచి 50 కిలోల వరకు పట్టుబడుతున్న గంజాయిని సీజ్‌ చేయడం, నిందితులపై కేసులు నమోదు చేయడం వరకూ బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

బానిసవుతున్న యువత: చౌకగా లభించడంతో పాటు గంజాయి తీసుకున్న విషయం చుట్టుపక్కల వారు గుర్తించలేకపోవడం ప్రధాన కారణం. అంతే కాకుండా మద్యం కంటే సులువుగా తక్కువ సమయంలోనే మత్తు ఆస్వాధించే అవకాశం ఉండటంతో గంజాయికి యువత ఆకర్షితులవుతున్నారు. సరదాగా అలవాటు చేసుకుని అతితక్కువ సమయంలోనే బానిసలుగా మారుతున్నారు.

మానసిక వైఖరిలో విపరీత మార్పులు: గతంలో గంజాయి వినియోగించిన వారి ప్రవర్తనలో స్వల్ప మార్పులు కనిపించగా, ఇప్పుడు భారీస్థాయిలో చూస్తున్నాము. గంజాయిని మరింతగా ఆస్వాదించాలనే తాపత్రయంతో మోతాదుకు మించి పీలుస్తూ గొడవలు, ఘర్షణలకు దిగుతున్నారు. ప్రధానంగా మానసికంగా వికార స్వభావం ప్రదర్శిస్తూ ఎదుటి వ్యక్తి ఊహించని విధంగా దాడులకు పాల్పడుతున్నారు.

సెంట్రల్ జైలులో గంజాయి కలకలం - లంచ్ బాక్స్​తో దొరికిన ఫార్మాసిస్టు

జోరుగా రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారం: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. విశాఖ, పాడేరు ప్రాంతాల్లో కిలో 2 నుంచి 3 వేల రూపాయలకు కొనుగోలు చేశాక, తిరుపతికి చేర్చేందుకు 10 వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రిటైల్‌ వ్యాపారులు గ్రాముల్లోకి తీసుకొచ్చి 10 గ్రాముల గంజాయి 500 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.

కిటకిటలాడుతున్న డీ-అడిక్షన్ సెంటర్లు: పోలీసులు సమాచారంతో పాటు, అలవాట్లలో మార్పులతో గంజాయి బానిసలైన యువతను తల్లిదండ్రులు గుర్తించగలుగుతున్నారు. దీంతో ప్రైవేటు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీ-అడిక్షన్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. బహిరంగంగా, రహస్యంగా ట్రీట్​మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య వేయికిపైగానే ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు గంజాయి పట్టివేతతోపాటు క్షేత్రస్థాయిలో విక్రయాలు, నియంత్రణపైనా దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయడం. బాధితులను ఎప్పటికప్పుడు గుర్తించి కౌన్సెలింగ్‌ కేంద్రాలకు తరలించడం. హోల్‌సేల్, రిటైల్‌ సరఫరాదారులపై నిఘా ఉంచాలి. కఠిన శిక్షలు పడేలా చూడాలి.

ఏకంగా 15 ఎకరాల్లో గంజాయి సాగు - పోలీసులు ఏం చేశారంటే?

కొన్ని ఘటనలు:

  • తిరుపతి జిల్లా పుత్తూరు మండలం వేపగుంట గ్రామంలో వారంరోజుల కిందట గంజాయి మత్తులో ఓ ఇంటి వద్దకు వచ్చిన యువకులు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పిలిచారు. విద్యార్థిని తల్లి వారిని మందలించగా మనస్సులో పెట్టుకుని రెండురోజుల క్రితం మరో ముగ్గురితో వచ్చి బీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన స్థానిక యువకుడిపైన దాడి చేసి, మహిళలను దుర్భాషలాడారు.
  • తిరుపతి వడమాలపేటకు చెందిన పలువురు విద్యార్థులు గంజాయి మత్తులో ఘర్షణ పడుతుండగా, అదే సమయంలో అటుగా వెళ్తున్న గ్రామానికి చెందిన యువకుడు వారిని వారించాడు. దీంతో కోపోద్రిక్తులైన వారు అతనిపై దాడికి తెగబడ్డారు. గాయపడిన యువకుడు నెలరోజులపాటు ప్రైవేటు హాస్పిటల్​లో చికిత్స తీసుకున్నాడు.
  • నగరి రైల్వే స్టేషన్‌లో తిరుత్తణి నుంచి వచ్చిన గంజాయి ముఠా సభ్యులు వారిలో వారే ఘర్షణ పడ్డారు. బ్లేడుతో పరస్పరం దాడులు చేసుకోవడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

విశాఖ నడిబొడ్డున గంజాయి సాగు - దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.