YCP Leaders Negligence of Nellore A.S. Pet Dargah : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏ.ఎస్.పేట దర్గా అంటే దేశంలో ఎంతో ప్రసిద్ధి గాంచింది. హిందూ, ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన ఆలయంగా భావిస్తారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఏ.ఎస్. పేట దర్గాపై వైసీపీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, భక్తులకు శాపంగా మారింది. రాజకీయ లబ్ధికోసం అభివృద్ధి చేస్తామంటూ వైసీపీ నేతలు హడావుడి చేశారు. దర్గా చుట్టూ రోడ్డు, మురగుకాలువ నిర్మించేందుకు కోటి 50 లక్షల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించారు. సర్వే పేరుతో కొలతలు వేసి పాత రోడ్లు పగలగొట్టారు. ఆ తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి.
స్వర్ణ దేవాలయాన్ని తలపిస్తున్న ఏడుగుర్రాల రథంపై గణనాధుడి మండపం.. ఎక్కడంటే..
ఇప్పటికి ఆరు నెలలు దాటినా పనులు పూర్తి కాలేదు. దీంతో దర్గా చుట్టూ మురుగు పారుతూ దుర్గంధంతో భక్తులు, స్థానికులు అవస్థలు పడుతున్నారు. కాలువలు తవ్వేసి అలానే వదిలేయడంతో మట్టి దిబ్బలు పేరుకుపోయి దుకాణాలు మూతపడ్డాయి. అభివృద్ధి చేస్తామంటూ ఉన్నవాటిని తొలగించి ఉపాధికి గండి కొట్టారంటూ దుకాణదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Nellore District AS Peta Darga History : ఏఎస్.పేట దర్గా అంటే దేశంలో ఎంతో ప్రసిద్ధి గాంచింది. హిందూ, ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన ఆలయంగా భావిస్తారు. భక్తులు తమ కోరికలు తీరటం కోసం రోజుల తరపడి దర్గాలోనే నిద్రచేస్తారు. దర్గాలోకి వెళితే తమ ఆరోగ్యాలు మెరుగుపడతాయని భక్తుల నమ్మకం. ఇంత ప్రాధాన్యత కలిగిన ఏఎస్ పేట దర్గాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోంది. రాజకీయ లబ్ది కోసం వైసీపీ నాయకులు దర్గా చుట్టూ రోడ్డు, మురుగు కాలువలు నిర్మిస్తామని కాలువలు తీశారు. రోడ్లు పగలగొట్టారు.
స్పాంజ్‌ను కడుపులో వదిలేసి కుట్లు వేసిన వైద్యులు.. రూ.15 లక్షలు జరిమానా
ఇప్పటికి ఆరు నెలలు కావస్తున్నా నిర్మాణాలు పూర్తి చేయలేదు. దీంతో దర్గా పరిసర ప్రాంతాలు తీవ్ర దుర్గంధంగా మారాయి. అటువైపు భక్తుల రావలంచే ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ దర్గాకు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఇక్కడ నెలకొన్న దుస్థితి వల్ల భక్తుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందని స్థానికులు, వ్యాపారులు తెలిపారు. పనులు ఎక్కడికక్కడే నిలిపివేయట వల్ల ఆరు నెలలుగా భక్తులు మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దుర్వాసనతో భక్తులు దర్గాలో ఉండలేకపోతున్నారు. భక్తుల రాకపోకలు సైతం తగ్గాయి. పరిసరాలు సరిగా లేక దుకాణాల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తమ వ్యాపారాలు జరగటం లేదని వాపోయారు. ఈ దుర్గంధం వల్ల తాము అనారోగ్యం బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాహనాలకు సైతం రాకపోకలకు తీవ్ర అంతరాయంగా ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.