ETV Bharat / state

పోలీసులు ఎదుటే వైసీపీ నేతల అరాచకం - సీఎం రమేష్​పై మూకదాడి - YCP attacked CM Ramesh convoy - YCP ATTACKED CM RAMESH CONVOY

YCP leaders Attacked on CM Ramesh Convoy: పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రజావ్యతిరేకత బయటపడుతుండటంతో వైసీపీ నేతల్లో అసహనం రోజురోజుకు పెరిగిపోతోంది. దాడులు, ఘర్షణలు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారు. అనకాపల్లిలో జిల్లాలో వైసీపీ అరాచక శక్తులు దౌర్జన్యకాండకు దిగాయి. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి స్వగ్రామంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేశ్‌పై మూకదాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటనలో సీఎం రమేశ్‌కు చెందిన మూడు కార్లు ధ్వంసమయ్యాయి.

YCP leaders attacked
YCP leaders attacked (Etv bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 8:02 PM IST

Updated : May 5, 2024, 7:06 AM IST

పోలీసులు ఎదుటే వైసీపీ నేతల అరాచకం- సీఎం రమేష్​పై మూకదాడి (etv bharat)

YCP Leaders Attacked on CM Ramesh Convoy : ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో వైసీపీ అరాచక శక్తులు దౌర్జన్యకాండకు దిగాయి. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి స్వగ్రామంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేశ్‌పై మూకదాడికి పాల్పడ్డారు. పోలీసు వాహనంలో వారి రక్షణలో ఉన్న ఎంపీపైనే రాళ్లు, ఇటుకలు విసిరి బీభత్సం సృష్టించారు. సీఎం రమేశ్‌ చొక్కా చింపేసినా పోలీసులు కేవలం బూడి అనుచరులను బతిమలాడుతూ కనిపించారే తప్ప ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం చూస్తే వైసీపీ అరాచకాలకు పోలీసులు ఎంతగా వంతపాడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రజావ్యతిరేకత బయటపడుతుండటంతో వైసీపీ నేతల్లో అసహనం రోజురోజుకు పెరిగిపోతోంది. దాడులు, ఘర్షణలు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం, లోక్‌సభ వైసీపీ అభ్యర్థి బూడి మూత్యాలనాయుడు స్వగ్రామం తారువలో కూటమి కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కార్యకర్తలకు అండగా నిలిచేందుకు అక్కడికి వెళ్లిన అనకాపల్లి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పైనా వైసీపీ అల్లరి మూకలు దాడికి యత్నించారు.

ధర్మవరంలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు - బీజేపీ కార్యకర్తలపై ఇనుప రాడ్లతో దాడి - YCP Activists attack BJP Activists

డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి స్వగ్రామం తారువలో ఎన్నికల ప్రచారంలో భాగంగా డ్రోన్‌తో బీజేపీ కార్యకర్తలు జెండా ఎగురవేశారు. అక్కడున్న డిప్యూటీ సీఎం, ఆయన అనుచరులు డ్రోన్‌ ఆపరేటర్లతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. డ్రోన్‌ను పగలగొట్టారు. ఆపరేటర్లు, బీజేపీ కార్యకర్తల కారు టైర్లలో గాలి తీసేశారు. బైక్‌లను అడ్డగించి చౌడవాడకు చెందిన బీజేపీ కార్యకర్త కొమర అప్పారావుపై చేయిచేసుకున్నారు. అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం బూడి బావమరిది, బీజేపీ కార్యకర్త అయిన గంగాధర్‌ ఈ దాడిని అడ్డుకోవడానికి యత్నించగా ఆయనపైనా వైసీపీ మూకదాడికి యత్నించింది. దీంతో ఆయన ప్రాణాలు రక్షించుకునేందుకు ముత్యాలనాయుడికి చెందిన పాత ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. ఆ ఇంట్లోనే ముత్యాలనాయుడి మొదటి భార్య కుమారుడు, స్వతంత్ర అభ్యర్థి అయిన రవి ఉంటున్నారు.

ముత్యాలనాయుడు తన అనుచరులతో తలుపులు బద్దలుకొట్టి గంగాధర్‌ను చెప్పుతో కొడుతూ, తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ సమాచారం అందుకున్న దేవరాపల్లి ఎస్సై నాగేంద్ర అక్కడికి వెళ్లి గంగాధర్‌ను కాపాడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు తాత్సారం చేస్తున్నారంటూ రమేశ్‌తోపాటు తెలుగుదేశం నేత బండారు అప్పలనాయుడు, స్వతంత్ర అభ్యర్థి బూడి రవికుమార్ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు.

ఏ1 పేర్ని కిట్టు - హత్యాయత్నం కేసు నమోదుచేసినా అరెస్టు చేయని పోలీసులు - Police Not Arrested Perni Kittu

అనంతరం వైసీపీ దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు సీఎం రమేశ్ తారువ వెళ్లారు. బాధితుడి ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడా పోలీసులు అడ్డగించారు. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు సైతం అనుచరులతో కలిసి దాడి చేసిన ఇంటి ముందే కూర్చుకున్నారు. అయితే తన ఇంట్లోకి వెళ్తున్న కుమారుడిని మూత్యాలనాయుడు అడ్డగించడంతో తండ్రీ కుమారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు బలవంతంగా సీఎం రమేశ్‌ను తమ వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా బూడి వర్గీయులు అడ్డుకుని దాడికి యత్నించారు.

పోలీసు వాహనంతో పాటు సీఎం రమేష్‌ వాహనాలపైకి రాళ్లు, కర్రలు విసిరి బీభత్సం సృష్టించారు. సీఎం రమేష్‌ చొక్కా చించేశారు. పోలీసు వాహనంపై దాడికి పాల్పడుతున్నా పోలీసులు చూస్తూ ఊరుకున్నారే తప్ప ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. మూకుమ్మడిగా వాహనాన్ని అడ్డగించి రాళ్లు, కర్రులు విసురుతున్నా వారిని పక్కకు తప్పుకోమంటూ బతిమాలారే తప్ప గట్టిగా హెచ్చరించలేదు. పోలీసులు, బూడి ముత్యాలనాయుడి తీరుపై సీఎం రమేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు.

బూడి ముత్యాలనాయుడి మొదటి భార్య కుమారుడు రవికి, తండ్రికి మధ్య మొదటి నుంచీ మనస్పర్థలు ఉన్నాయి. సొంత కుమారుడిని కాదని రెండో భార్య కుమార్తె ఈర్లె అనురాధకు మాడుగుల టిక్కెట్ ఇప్పించడంతో ఆగ్రహించిన రవి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. తన తండ్రిని ఓడించాలంటూ ఆయన ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఆయన మేనమామ చప్ప గంగాధర్‌ బీజేపీ కార్యకర్త. తనకు వ్యతిరేకంగా కుమారుడు, బావమరిది ప్రచారం చేయడాన్ని సహించలేకపోతున్న బూడి ముత్యాలనాయుడు కోపంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు ఆయన కుమారుడు రవి తెలిపారు. తనపై హత్యాయత్నానికి పాల్పడినట్లు బూడిముత్యాలనాయుడిపై బావమరిది గంగాధర్ కేసు పెట్టారు.

దెందులూరులో మళ్లీ గొడవ- టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడిన వైఎస్సార్సీపీ శ్రేణులు - YsrCP Activists Attack TDP Leaders

Last Updated : May 5, 2024, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.