ETV Bharat / state

పెట్రెగిపోయిన పేర్ని కిట్టు అనుచరులు - జనసేన నేత ఇంటిపై దాడి - Perni Kittu Follower Attack - PERNI KITTU FOLLOWER ATTACK

YCP Leader Perni Kittu Followers Attack On Karri Mahesh house: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు, జనసేన నేత కర్రి మహేష్ ఇంటి ముందు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వారిని ప్రశ్నించినందుకు పేర్ని కిట్టు అనుచరులు కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు.

పెట్రెగిపోయిన పేర్ని కిట్టు అనుచరులు - జనసేన నేత ఇంటిపై దాడి
పెట్రెగిపోయిన పేర్ని కిట్టు అనుచరులు - జనసేన నేత ఇంటిపై దాడి (ఈటీవీ భారత్​ ప్రత్యేకం)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 6:31 PM IST

YCP Leader Perni Kittu Followers Attack On Karri Mahesh house: అధికార వైసీపీ నేతలకు, కార్యకర్తలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలపై దాడులకు పాల్పుడుతున్నారు. ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు వైసీపీ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. మెున్న చిత్తూరు జిల్లాలో ప్రచారానికి వెళ్లిన బీసీవై నేతలపై దాడికి దిగిన వైసీపీ నేతలు, కార్యకర్తలు... తాజాగా నేడు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జనసేన నేత ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, ఇంట్లో ఉన్న మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇంటిపై దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పోలీసులు స్పందించడం లేదంటూ జనసేన, టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడికి పాల్పడ్డారు. మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేశ్‌ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడికి పాల్పడ్డారు. విశ్వబ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు అనుచరులు, కర్రి మహేశ్‌ ఇంటి ముందు బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదేంటని ప్రశ్నించినందుకు కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి పేర్ని కిట్టు అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో కర్రి మహేశ్‌ కుటుంబసభ్యులు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

టీడీపీ సానుభూతిపరురాలిపై వైఎస్సార్సీపీ నేతల దాడి- వీడియో వైరల్​

దాడి ఘటనపై కర్రి మహేశ్‌ కుటుంబ మచిలీపట్నం పీఎస్‌లో సభ్యుల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పోలీసులు స్పందిచకపోవడంతో, తమపై దాడిచేసినా పోలీసులు పట్టించుకోవట్లేదంటూ పీఎస్‌ వద్ద జనసేన, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. టీడీపీ, జనసేన ఆందోళనకు మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ మద్దతు తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.

వైసీపీ నేత పేర్ని కిట్టు విశ్వ బ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చాడు. అందులో భాంగా మా ఇంటి ముందు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదేంటని ప్రశ్నించినందుకు పేర్ని కిట్టు అనుచరులు మా ఇంట్లోకి చొరబడి ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇదే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పోలీసులు స్పందించడం లేదు. కర్రి మహేష్, జనసేన నేత

కాంగ్రెస్​కు మద్దతు - వృద్ధులపై వైసీపీ నేతల దాడి - వీడియో విడుదల చేసిన వైఎస్ సునీత - YCP Leaders Attacks

పెట్రెగిపోయిన పేర్ని కిట్టు అనుచరులు (ఈటీవీ భారత్)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.