ETV Bharat / state

హమ్మయ్యా అవి పులి పిల్లల కాదు- ఊపిరి పీల్చుకున్న రైతులు

పొలంలో లభ్యమైన నాలుగు అడవి పిల్లి కూనలు

Wild Cat Cubs in Nandyal District
Wild Cat Cubs in Nandyal District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Wild Cat Cubs in Kothapalli : అడవిలో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసంలోకి ఒక్కోసారి అదుపు తప్పి వస్తుంటాయి. ఇటీవలి కాలంలో వీటి సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దీంతో వారికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా కొత్తపల్లి శివారులోని పొలాల్లో 4 అడవి పిల్లి పిల్లలు లభ్యమయ్యాయి. వరి పొలంలో గట్టుపై ఉన్న వీటిని చూసి రైతులు ఆందోళనకు గురయ్యారు.

ఇవి పులి కూనలని భయపడి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు అవి అడవి పిల్లి పిల్లలని నిర్ధారించారు. వాటిని అక్కడే ఉంచి రక్షణ కల్పించారు. కొంత సమయం తర్వాత వాటిలో రెండింటిని తల్లి పిల్లి వచ్చి తీసుకెళ్లింది. మిగతా వాటిని కూడా తీసుకెళ్తుందని వారు చెప్పారు.

మరోవైపు అడవి పిల్లి శరీరం మీద చారలు భిన్నంగా ఉంటాయి. వాటికి పొడవైన తోక ఉంటుంది. చెట్లలో కదులుతున్నప్పుడు ఇదే నా బ్యాలెన్సింగ్‌కు ఉపయోగపడుతుంది. నిట్టనిలువుగా ఉన్న చెట్లను కూడా ఎంచక్కా ఎక్కేయగలదు. పగటిపూట విశ్రాంతి తీసుకుని, రాత్రిపూట వేటాడుతుంది. నెమళ్లు, అడవి కోళ్లు, జింకలు, కుక్కలను ఆహారంగా తీసుకుంటుంది. వీటి జీవితకాలం దాదాపు 11 సంవత్సరాలు.

Jungle Cat Died: రోడ్డు ప్రమాదంలో అడవి పిల్లి మృతి

అడవి పిల్లి దాడిలో 14 మేక పిల్లలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.