ETV Bharat / state

స్నేహితుడని ఆదరిస్తే అదునుచూసి ఉసురు తీశారు - తెరవెనుక ఆమె సహకారం! - ప్రియుడితో కలిసి భర్త హత్య

Wife Killed Husband Along with Boyfriend: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చిందో భార్య. ఈ ఘటన సత్యసాయి జిల్లా కదిరి మండలంలో చోటుచేసుకుంది.

Wife_Killed_Husband_Along_with_Boyfriend

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 12:29 PM IST

Wife Killed Husband Along with Boyfriend: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన సత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల ఎంట్రీతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

సీఐ తెలిపిన వివరాల ప్రకారం: కదిరి మండలంలోని చిన్నపుట్టతండాలో ఖాదర్​ బాషా ఐచర్ వాహన డ్రైవర్​గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడు డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో నిజాంవలి కాలనీకి చెందిన షేక్ బాబ్జాన్​తో స్నేహం కుదిరింది. దీంతో అతడు తరచూ ఖాదర్ బాషా ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఖాదర్​ బాషా భార్య గులాబ్​ జాన్​కు, షేక్​ బాబ్జాన్​ల మధ్య పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది.

వీరి మధ్య బంధం గురించి భర్తకు తెలియటంతో భార్యను పలుమార్లు మందలించాడు. అయినా కూడా ఆమె తన తీరు మార్చుకోలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో తమ వివాహేత బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన గులాబ్​ జాన్​.. భర్తను హతమార్చాలని నిర్ణయించుకుని ప్రియుడితో చర్చించింది. ఖాదర్​ బాషాను అడ్డుతొలగించుకునేందుకు వారిద్దరూ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

తెనాలిలో వివాహిత దారుణ హత్య- గొంతుకోసి హతమార్చిన దుండగులు

అనుకున్నట్లుగానే గత నెల 31న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తను గుర్తించిన గులాబ్ జాన్.. ప్రియుడు షేక్ బాబ్జాన్​కు ఫోన్​ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. అనంతరం మద్యం మత్తులో ఉన్న తన భర్తతో కావాలనే గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో భర్త తలపై కర్రతో బలంగా మోదింది. దీంతో ఖాదర్​ బాషా కింద పడిపోగా ఆమె ప్రియుడు షేక్ బాబ్జాన్ అతడి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకుని కారెడ్డిపల్లి సమీపంలోని వాగు వద్ద పెట్రోల్ పోసి తగులబెట్టారు. అయితే మృతదేహం సరిగా కాలకపోవటంతో కొంత భాగాన్ని ప్లాస్టిక్ సంచిలో కుక్కి.. వాగులో పడేశారు.

పథకం ప్రకారమే ఖాదర్​ బాషాను హత్య చేసిన భార్య ఏం తెలియనట్లుగా నటిస్తూ ఫిబ్రవరి 1న ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త తిరిగి రాలేదంటూ ఐదో తేదీన కదిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు భార్య గులాబ్​ జాన్​పై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో అసలు నిజం బయటకు వచ్చింది. వివాహేత సంబంధానికి అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు గులాబ్​ జాన్ అంగీకరించింది.

భార్యపై అనుమానం- నోట్లో కరెంట్​ వైర్​ పెట్టి హత్య చేసిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.