ETV Bharat / state

ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి- రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళిక - Solid Waste Management Plant

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 2:13 PM IST

Updated : Aug 28, 2024, 2:25 PM IST

Solid Waste Management Plant in Visakha: చెత్త నుంచి సంపద తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి వెయ్యి టన్నుల చెత్తను మండించి 15 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదే తరహా విధానం అమలు చేయడానికి నూతన సాంకేతికతను కార్యాచరణ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విదేశాల్లో మాదిరిగానే ప్లాంటు నుంచి దుర్వాసన రాకుండా పటిష్ట చర్యలు చేపట్టనున్నారు.

SOLID WASTE MANAGEMENT PLANT
SOLID WASTE MANAGEMENT PLANT (ETV Bharat)

Wealth Creation From Solid Waste Management Plant in Visakha: చెత్త నుంచి సంపద సృష్టిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ఈ ఆలోచనను అమల్లోకి తీసుకురాగా విశాఖ కాపులుప్పాడ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. విశాఖ, విజయనగరం ప్రాంతాల నుంచి వెయ్యి టన్నుల చెత్తను మండించి తద్వారా 15 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఇతర దేశాల్లో కనీసం ఒక్క శాతం దుర్వాసన లేని విధానం ఉంది. రాష్ట్రంలోనూ అదే తరహా విధానం అమలు చేయడానికి నూతన సాంకేతికతను అందిపుచ్చుకొనేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుంది: మంత్రి నారాయణ - Credai South Con 2024

విశాఖలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డులోని ప్లాంటు నుంచి దుర్వాసన రాకుండా పటిష్ట చర్యలు చేపడతామని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. విదేశాల్లో భారీ భవనాల మధ్య ప్లాంటులున్నా ఇబ్బందులు లేవని కాపులుప్పాడ నుంచి మాత్రం దుర్వాసన ఎందుకు వస్తుందని మంత్రి నారాయణ ప్రశ్నించారు. విదేశాల్లో చెత్త నిల్వ ఉంచే ప్రదేశాలు పూర్తిగా గాజు గదుల మధ్య ఉంచుతారని, అందువల్ల వాసన బయటకు రాదని నిర్వాహకులు చెప్పారు. వాటి కోసం ప్రభుత్వం నుంచి అవసరమైన సాయాన్ని అందిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక ఆధారంగా గాజు గదులు ఏర్పాటుపై ఆలోచించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంత్రిని కోరారు. వీలైనంత త్వరగా కాపులుప్పాడ ప్లాంటు నుంచి దుర్వాసన రాకుండా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.

టీడీఆర్ బాండ్ల అక్రమాలపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాం: మంత్రి నారాయణ - Narayana Review on Urban Development

2014-19 మధ్య మంత్రిగా ఉన్న సమయంలో అమరావతి రాజధాని కోసం దేశవిదేశాలు తిరిగామని మంత్రి నారాయణ తెలిపారు. అక్కడ అంతా సాలిడ్​ వ్యర్థాలు, లిక్విడ్​ వ్యర్థాల గురించి తెలుసుకున్నామన్నారు. విశాఖలో సుమారు లక్షకు పైగా చెత్తబుట్టలు, ఐదు వందల ప్రత్యేక చెత్త సేకరణ వాహనాలు ద్వారా చెత్త ఇక్కడకు చేరుతున్నట్లు నిర్వాహకులు మంత్రికి వివరించారు. చెత్తను విద్యుత్​ వినియోగానికి ఉపయోగించగా మిగిలిన వ్యర్థాలను సిమెంట్ ఇటుక తయారీలో ముడి సరుకుగా వినియోగిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఫలితంగా నగరం శుభ్రం అవుతోందన్నారు. మరో వైపు 15 మెగావాట్ల విద్యుత్ ముడి సరుకుతో సిమెంట్ ఇటుకల తయారీ వంటి ప్లాంట్​లను అన్ని జిల్లాలో ముందు దశలో అమలు చేసే ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

ఏపీలోనూ హైడ్రా? అక్రమ నిర్మాణాలను సహించం- మంత్రి నారాయణ - Hydra Demolition in AP

Last Updated : Aug 28, 2024, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.