ETV Bharat / state

గుక్కెడు మంచినీళ్లివ్వండి మహాప్రభో - కోన గ్రామస్థుల ఆవేదన - WATER PROBLEM IN KONA - WATER PROBLEM IN KONA

Water Problem in Kona Village of Machilipatnam : గుక్కెడు మంచినీళ్లివ్వండి మహాప్రభో అంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం కోన గ్రామస్ధులు అధికారులను వేడుకుంటున్నారు. నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

water_problem_in_machilipatnam_kona_village

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 12:54 PM IST

Water Problem in Kona Village of Machilipatnam : గుక్కెడు మంచినీళ్లివ్వండి మహాప్రభో అంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం కోన గ్రామస్ధులు అధికారులను వేడుకుంటున్నారు. నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి కుళాయి వేస్తామన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం హామీని గాలికి వదిలేసిందని మండిపడుతున్నారు. నీరు ఎప్పుడు వదులుతారా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు.

గుక్కెడు మంచినీళ్లివ్వండి మహాప్రభో - కోన గ్రామస్థుల ఆవేదన

జగన్ సర్కారు నిర్లక్ష్యంతో నీటి కోసం ప్రజల అవస్థలు - water crisis at kurnool

Machilipatnam Faces Drinking Water Crisis : మచిలీపట్నం గ్రామీణ మండలం కోన గ్రామంలో ఎక్కడ చూసినా మంచినీటి ట్యాంకు చుట్టూ డ్రమ్ములే దర్శనమిస్తాయి. ఇక్కడ దాదాపు 5 వేల మంది జనాభా నివసిస్తున్నారు. రోజు విడిచి రోజూ నీటిని విడుదల చేస్తుండటంతో పెద్ద పెద్ద డ్రమ్ములలో నిల్వ చేసుకుంటున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. మచిలీపట్నం గ్రామీణ ప్రజలకు తరకటూరు వాటర్ స్టోరేజ్ నుంచి నీటిని అందిస్తున్నారు. తరకటూరు వాటర్ స్టోరేజ్ ట్యాంక్‌లో ఏదైనా సమస్య వస్తే నాలుగైదు రోజులు నీటిని విడుదల చేయరని కోన గ్రామస్థులు చెబుతున్నారు. నీటి సరఫరాకు నిధులు కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

ఎండాకాలమే కాదు - జగనన్న పాలనలో ఐదేళ్లూ నీటి కొరతే - Water Problems in Annamayya

'నీళ్ల కోసం చాలా కష్టాలు పడుతున్నాం. ఓ పక్క ఎండలు మండిపోతుంటే తాగే నీళ్లకు కూడా ఆంక్షలతో వాడుకోవాల్సి వస్తుంది. ఏ పని చెయ్యాలన్నా నీరే కదా అవసరం. అలాంటిది నీరు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎంత మంది ప్రజా ప్రతినిధులు గ్రామానికి వచ్చినా మా సమస్య పట్టించుకున్న నాథుడే లేడు. నెల రోజులకు నాలుగు డ్రమ్ముల నీళ్లతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఉంది. ' -లక్ష్మి, జయలక్ష్మి, స్థానికులు

గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే పేర్ని నానిని ఇంటింటికి కుళాయి హామీ గురించి అడిగితే నెరవేరుస్తామని చెప్పి జారుకున్నారని మహిళలు తెలిపారు. తాము సొంతంగా పంపులు వేయించుకోవాలని చూసినా ఫలితం లేదన్నారు. సముద్రపు ప్రాంతం కావడంతో నీళ్లు ఉప్పగా ఉండటం వల్ల తాగేందుకు పనికి రావని ఆవేదన వ్యక్తం చేశారు.

గొంతెండుతోంది - తాగునీటి సమస్య తీర్చరా సారూ ! - Drinking Water Problem in Ongole

IPL​కు నీటి కష్టాలు​! క్రికెట్​ బోర్డుకు NGT నోటీసులు- మ్యాచులపై ప్రభావం పడనుందా? - Bengaluru Water Crisis IPL Match

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.