ETV Bharat / state

సంగారెడ్డి మహిళా కళాశాలలో విపణి కార్యక్రమం - తమలోని టాలెంట్​ను బయటపెట్టిన విద్యార్థులు - Students Innovations Women College

Vipani Program in Govt Women College : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విపణి పేరుతో వంటల ద్వారా వ్యాపారాలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. కుట్లు, అల్లికల్లోనూ ముందడుగు వేసేలా వెన్ను తడుతున్నారు.

Business Awareness Program in Govt College
Vipani Program in Govt Women College in Sangareddy
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 11:03 AM IST

Business Awareness Program in Govt College
Vipani Program in Govt Women College in Sangareddy

Vipani Program in Govt Women College : పోటీ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సంపాదిస్తేనే సమాజంలో రాణించగలమనేది అపోహే. కొలువులే కాదు వ్యాపారాల్లోనూ రాణించవచ్చు. విద్యార్థి దశ నుంచే వ్యాపారంపై అవగాహన కల్పించేందుకు సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళ కళాశాల అధ్యాపకులు ప్రయత్నిస్తున్నారు. విపణి అనే కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తున్నారు.

Vipani Program Sangareddy Govt Women College : వంటలు, కుట్లు, అల్లికలు సహా ఇతర నైపుణాల్యను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించారు. విపణి కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో 40 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులు (Students) తయారు చేసిన వంటల్ని విక్రయానికి పెట్టారు. శాకాహారం, మాంసాహార వంటకాలు, టిఫిన్లు, స్వీట్లు వంటి వంటకాల్ని విద్యార్థులు స్వయంగా వండారు. ఈ కార్యక్రమంలో చికెన్‌ బిర్యానీ సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

యువ ఔత్సాహికుల వినూత్న ఆవిష్కరణలు- అకట్టుకున్న వన్‌ డిస్ట్రిక్ట్‌ - వన్‌ ఎగ్జిబిషన్‌

విపణి కార్యక్రమం ద్వారా కేవలం చదువుకొని ఉద్యోగాలు చేయడమే కాకుండా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చని మా ద్వారా అందరికి తెలియబరుస్తున్నాము. ఇందులో భాగంగా మా టాలెంట్​ను బయటపెడుతున్నాం. ఇలా చేయడం వల్ల బయట వ్యాపారాలు చేయడంపై అవగాహన తెచ్చుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగం అనేదే కాకుండా మనకు ఉన్న టాలెంట్​ను బిజినెస్​ ద్వారా పెట్టొచ్చు. మన కాళ్ల మనం నిలబడొచ్చు ." - విద్యార్థినులు

ఇక్కడ విద్యాబుద్ధులే కాదండోయ్ - అంతకు మించి నేర్పిస్తారు ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు

ఆహార పదార్థాలు తయారు చేయడం, విక్రయించడం ద్వారా తమకు ఈ రంగంలోని వ్యాపార అవకాశాలపై అవగాహన వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. వంటల తయారీ కోసం తాము పెట్టిన పెట్టుబడికి వచ్చిన ఆదాయం బేరీజు వేసుకుని లాభనష్టాలను తెలుసుకుంటున్నామని చెప్పారు.

"మహిళ ప్రభుత్వ కళాశాలలో విపణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. చదువులు పూర్తయ్యాక వ్యాపారం​ వైపు వెళ్లాలి అనుకునేవాళ్లకు ఇది ఒక మంచి ప్రాక్టీస్​ లాంటిది. విద్యార్థులు వ్యాపారస్థులయితే ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినవాళ్లు అవుతారు." - వల్లూరు క్రాంతి, కలెక్టర్​

Business Awareness Program in Govt College : కుట్లు, అల్లికలతో విద్యార్థులు తయారు చేసిన ఉత్పత్తుల్ని విపణిలో ప్రదర్శించారు. దేవుళ్ల ప్రతిమలు ఆకట్టుకున్నాయి. ఉగాది, క్రిస్‌మస్‌, సంక్రాంతి, వరలక్ష్మివ్రతం వంటి పండుగల గురించి విద్యార్థులు వివరించారు. విపణిలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. విద్యార్థులు కలెక్టర్‌కు రంగోళి వేసి అందుకు డబ్బులు తీసుకున్నారు. చదువుతోపాటు వ్యాపార నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్‌ క్రాంతి సూచించారు. విపణి కార్యక్రమం వారిలో ఉత్సాహాన్ని నింపిందని వ్యాపారం చేసే దిశగా వారిలో ఆలోచనల్ని పురిగొల్పిందని అధ్యాపకులు తెలిపారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి ఇంటి వద్ద పూర్వ విద్యార్థుల శ్రమ దానం

గురువు ప్రోత్సాహం, విద్యార్థులు అద్భుతం - ఆవిష్కరణల్లో సత్తా చాటుతున్న విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.