ETV Bharat / state

తొలిపూజలు అందుకునేందుకు సిద్ధమైన బొజ్జగణపయ్య - ఊరూవాడా కోలాహలంగా ఏకదంతుని మండపాలు - VINAYAKA CHAVITHI Festival in AP - VINAYAKA CHAVITHI FESTIVAL IN AP

Ganesh Chaturthi Festival: వినాయక చవితి సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంది. తొలిపూజలు అందుకునేందుకు విఘ్నేశ్వరుడు ముస్తాబయ్యాడు. వాడవాడల్లో విభిన్న హంగులతో నిర్వాహకులు వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏకదంతుని మండపాలతో ఊరూవాడా కోలాహలంగా మారింది. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న బొజ్జ గణపయ్య ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి.

Vinayaka Chavithi Celebrations
Vinayaka Chavithi Celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 7:09 AM IST

తొలిపూజలు అందుకునేందుకు సిద్ధమైన బొజ్జగణపయ్య - ఊరూవాడా కోలాహలంగా ఏకదంతుని మండపాలు (ETV Bharat)

Vinayaka Chavithi Celebrations Across The State: రాష్ట్రవ్యాప్తంగా వినాయకచవితి పండుగ సందడి నెలకొంది. తొలిపూజలు అందుకునేందుకు విఘ్నేశ్వరుడు ముస్తాబయ్యాడు. వాడవాడల్లో విభిన్న హంగులతో నిర్వాహకులు వినాయక మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వాటికి ఏ మాత్రం తీసిపోకుండా వివిధ రూపాల్లో గణనాథుల్ని కొలువుదీర్చారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదంతో విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఆకట్టుకుంటున్న బొజ్జ గణపయ్య ప్రతిమలు: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చతుర్థి శోభ నెలకొంది. ఆది దేవుడైన గణనాథునికి పూజలు చేసేందుకు భక్తులు సర్వం సిద్ధం చేశారు. ఏకదంతుని మండపాలతో ఊరూవాడా కోలాహలంగా మారింది. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న బొజ్జ గణపయ్య ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. నెల్లూరు మాగుంట లేఅవుట్ లో ఖరీదైన లంబోదరుడిని ఏర్పాటు చేశారు. తంజావూరు ఆలయం తరహా సెట్టింగ్‌ వేశారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అంతరాలయాన్ని అలంకరించారు. బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో చలువ పందిళ్లలో గణనాథులు కొలువుతీరారు.

బాహుబలి తరహాలో పందిరి సెట్టింగ్: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పలు పాఠశాలల్లో ముందస్తు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒంగోలు దక్షిణ బజార్‌లో 33 అడుగల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సమతా నగర్‌లో 15 వందల కొబ్బరి కాయలతో 15 అడుగుల ఎత్తులో వినాయకుడ్ని ప్రతిష్టించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రంథాలయం వీధిలో బాహుబలి తరహాలో సెట్టింగ్ వేసి వినాయకచవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కడపలో పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశాయి. కర్నూలులో భారీ వాహానాల్లో వినాయక విగ్రహాలను నిర్వాహకులు మండపాలకు తీసుకువచ్చారు. పూజసామగ్రి కొనేందుకు వచ్చినవారితో బజార్లు కిటకిటలాడాయి.

గణపతిని ఎందుకు పూజించాలి? ఎలా పూజించాలి? – చవితి సమస్త సమాచారం మీకోసం - Vinayaka Chavithi 2024

విద్యుత్‌ అలంకరణలతో కాంతులీనుతున్న ఆలయాలు: అన్నమయ్య జిల్లా రాయచోటిలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ప్రజలకు మట్టి వినాయకుడి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసింది. నంద్యాలలో టెక్కే ఆంజనేయస్వామి గుడి వద్ద టీడీపీ నాయకుడు రామచంద్రరావు 15 వందల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. శ్రీశైల మహా క్షేత్రంలో ఇవాళ్టి నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం విద్యుత్‌ అలంకరణలతో కాంతులీనుతుంది.

మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ: కోనసీమ జిల్లా అయినవిల్లిలోని శ్రీవిఘ్నేశ్వరస్వామి ఆలయంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లా చీమలవలస అమ్మ దేవస్థానం నిర్మాణకర్త శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో 20 వేల మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. నెల్లూరు వెంకటరమణ బుక్ షాపీ యజమాని శ్రీనివాసరావు మట్టి విగ్రహాలపై వినూత్నంగా ప్రచారం చేశారు. 21 రకాల ఔషధ గుణాలున్న పత్రి ఆకులతో పూజ చేయడమే కాకుండా పేర్లు రాసి అవగాహన కల్పించారు.

గణపయ్యా నీ పూజ చేసేదెలాగయ్యా!- కన్నీరుమున్నీరవుతున్న వ్యాపారులు, ప్రజలు - Vinayaka Chavithi in Vijayawada

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.