ETV Bharat / state

వరదలతో అతలాకుతలమైన విజయవాడ - బుడమేరు ఉద్ధృతికి ప్రజల తీవ్ర ఇబ్బందులు - Floods in Vijayawada - FLOODS IN VIJAYAWADA

Heavy Rains and Floods in Vijayawada: విజయవాడ నగరాన్ని వరదలు వణికిస్తున్నాయి. 50 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయి వర్షం నమోదు కావడంతో బుడమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో నుంచి హైదరాబాద్‌, కోల్‌కతా వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా నీటమునిగాయి. బుడమేరు ఉద్ధృతికి విజయవాడ అతలాకుతలం అవుతుంది.

BUDAMERU FLOOD EFFECT
BUDAMERU FLOOD EFFECT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2024, 10:50 PM IST

Updated : Sep 1, 2024, 10:58 PM IST

Vijayawada People Suffer Heavy Rains and Floods: భారీ వర్షాలు, వరదలు విజయవాడ నగరాన్ని గడగడలాడిస్తున్నాయి. కుండపోత వానకు బెజవాడ వాసులు గజగజ వణికిపోతున్నారు. 50 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయి వర్షం నమోదు కావడంతో బుడమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. పలు ప్రాంతాల్లో కట్టలు తెగిపోవడంతో అజిత్‌ సింగ్‌ నగర్‌, రాజరాజేశ్వరీపేట, పైపుల్‌ రోడ్‌, రాజీవ్‌ నగర్‌, కండ్రిక, జక్కంపూడి కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతకంతకు వరద పెరుగుతుండటంతో ఇళ్లను, వాహనాలను వదిలేసి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

ఎన్నడూ లేని స్థాయిలో వరద : విజయవాడ జలవాడగా మారింది. నగరంలో ఎటుచూసినా నీరు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఐదు దశాబ్దాల కాలంలో కనివినీ ఎరుగని రీతిలో కుండపోత వర్షం కురవడంతో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో బుడమేరు కట్టలకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధానంగా వైఎస్‌ఆర్‌ జక్కంపూడి కాలనీ, అజిత్‌ సింగ్‌నగర్‌, రాజరాజేశ్వరీపేట, వాంబేకాలనీ, పైపులరోడ్డు, ప్రకాశ్‌నగర్‌, సుందరయ్యనగర్‌, రాజీవ్‌ నగర్‌, కండ్రిక కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లోకి ఆరు అడుగులకుపైగా నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్నా ఎన్నడూ ఈ స్థాయిలో వరద చూడలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుడమేరు ఉద్ధృతితో అల్లాడుతున్న ప్రజలు: బుడమేరు ఉగ్రరూపానికి సింగ్‌నగర్‌ పరిసర ప్రాంత ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇళ్లను పూర్తిగా వరద ముంచెత్తడంతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కొందరు ఇళ్లపైకి చేరి ప్రాణాలు కాపాడుకున్నారు. గంటగంటకు వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు టాక్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారుల్లోకి వరద భారీగా చేరడంతో ప్రజలు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి తిండి, నీరులేక ప్రజలు అల్లాడుతున్నారు. అధికారులు ఆహార సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సింగ్‌ నగర్‌ దిగువ ప్రాంతంలో సుమారు ఐదు కిలోమేటర్ల పరిధిలో పదుల సంఖ్యలో కాలనీలు పీకల్లోతు వరదలోనే కాలం వెళ్లదీస్తున్నాయి.

రికార్ఢు వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాకుతలం - Heavy Rains in Krishna District

అకస్మాత్తుగా ముంచెత్తిన వరదతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గర్భిణీలను అంబులెన్సులలో ఆసుపత్రులకు తరలించారు. బుడమేరు వరద ఉద్ధృతికి సింగ్‌ నగర్‌ రైల్వే అండర్‌ పాస్‌ పూర్తిగా నీటమునిగింది. రాజరాజేశ్వరీపేట, జక్కంపూడి కాలనీలను పూర్తిగా వరద ముంచెత్తింది. దీంతో డాబాలపై నుంచే సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. సింగ్‌ నగర్‌ పరిసర ప్రాంతాలు కాలువల్ని తలపిస్తున్నాయి. రైతుబజార్లు, షాప్‌లు, ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. పైపుల్ రోడ్‌ పరిసర కాలనీలు చెరువులుగా మారాయి.

సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాం: ఎల్​బీఎస్‌ నగర్‌, శాంతినగర్‌, వాంబేకాలనీ, సుందరయ్యనగర్‌, రాజీవ్‌నగర్‌, కండ్రిక కాలనీల్లో మొదటి అంతస్తు స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వాహనాలు, వస్తువుల్ని నీటిలోనే వదిలేసి డాబాలు, తెలిసిన వారి ఇళ్లపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే వరద ముంచెత్తిందని కన్నీటిపర్యంతం అవుతున్నారు. విజయవాడ చరిత్రలో బుడమేరుకు ఈ స్థాయిలో వరద ఎప్పుడూ చూడలేదని సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జలదిగ్బంధంలో విజయవాడ - గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం - ఆరుగురు మృతి - HEAVY RAINS IN VIJAYAWADA

రహదారులపై నిలిచిన రాకపోకలు : ఊహించని స్థాయిలో పోటెత్తిన వరదతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుడమేరు ఉద్ధృతికి విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని కాలనీలు అతలాకుతలం అవుతున్నాయి. ఆటోలు, బైకులు, కార్లు పడవల్లా నీటిలో తేలుతున్నాయి. నగరంలో నుంచి హైదరాబాద్‌, కోల్‌కతా వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా నీటమునిగాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమ, మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల ఇబ్బందుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. అవసరమైన ఆహార సదుపాయాల్ని అందజేస్తున్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సహాయ బృందాల సాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

విజయవాడ టూ-హైదరాబాద్ వయా పిడుగురాళ్ల- ఆర్టీసీ బస్సుల దారి మళ్లింపు - Officials Stop RTC Buses

Last Updated : Sep 1, 2024, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.